హవా మూవీ రివ్యూ

ఓవర్సీస్ మార్కెట్ పెరిగిన తర్వాత విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లు నిర్మాణ రంగంలోకి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. అంతే కాదు… అక్కడే సినిమా మొత్తం రూపొందించి గ్రాండ్ గా రీలీజ్ చేసి సక్సెస్ సాధిస్తున్నారు. అలా రూపొందించిన చిత్రమే హవా. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన తెలుగు వాళ్లు కలిసి ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. ఇటీవలే రిలీజ్ చేసిన హవా ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి బాగా పెరిగింది. చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా మహేష్‌ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే….
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుంది. చార్లీ (చైతన్య మాదాడి)కి ఓ సోదరి వుంటుంది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆమె బాధ్యత తనే చూస్తాడు. జీవనం కోసం చిన్న చిన్న నేరాలు చేస్తూ పెరుగుతాడు. ఏదైనా పెద్ద క్రైమ్‌ చేసి సెటిల్‌ అయిపోవాలని చార్లీ నిర్ణయించుకొని స్నేహితుడు చెప్పింది వినకుండా ఆస్ట్రేలియాలోని డార్క్‌ హార్స్‌ రైడింగ్‌ బెట్టింగ్‌ మాఫియాలోకి అడుగుపెడతాడు. దాంతో బెట్టింగ్‌లో మునిగిపోయిన చార్లీని అతని స్నేహితుడిని మాఫియా గ్యాంగ్‌ ఎటాక్‌ చేస్తారు. వారి నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి దేశం వదిలి పోవాలనుకుంటారు. ఈ రోడ్ జర్నీలో అసలు ఏం జరిగింది. దేశందాటి వెళ్లి పోయారా లేదా. గ్యాంగ్ నుంచి తప్పించుకున్నారా లేదా. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష
సినిమా కథ అంతా ఆస్ట్రేలియాలోనే జరుగుతుంది. చిత్ర షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే షూటింగ్ చేశారు. అందమైన లొకేషన్స్ కావడంతో బ్యాక్ డ్రాప్ ఆస్ట్రేలియాకావడంతో కొత్త తరహా కథ, కథనం చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాతలు మంచి లొకేషన్స్ ఎంపిక చేశారు. దీంతో సినిమా ఆద్యంతం రిచ్ గా కనిపిస్తుంది. ఇక హీరో చైతన్య కొత్త వాడిలా అనిపించలేదు. కథను తన భుజాల మీదేసుకొని నడిపించాడు. సినిమాలోని సమస్య తనతోనే మొదలౌతుంది… తానే ఆ సమస్యను ఎలా తీర్చుకున్నాడనే పాత్రలో నటించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అటు యాక్షన్ పార్ట్ తో పాటు రొమాన్స్ విషయంలోనూ చాలా కాన్ఫిడెంట్ గా నటించాడు. హీరో హీరోయిన్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. పారిపోయే సన్నివేశాల్లో ఇద్దరి మధ్య సీన్స్ బాగా కుదిరాయి. ఎమోషన్స్ ని బాగా పండించారు. చైతన్య డీసెంట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. మూవీ మొత్తం ఆయన పాత్ర ప్రధానంగా సాగుతుంది. హీరోయిన్‌ దివి ప్రసన్న అందం అభినయంతో ఆకట్టుకుంది. మిగిలిన పాత్రధారులు సైతం తమ పాత్రలకు న్యాయం చేశారు.

డైరెక్టర్ మహేష్ రాసుకున్ కథ, కథనం ఆసక్తికరంగా ఉంది. ఇప్పటివరకు చూడని కథగా చెప్పొచ్చు. ప్రతీ సీన్ ను కొత్తగా మలిచేందుకు ట్రై చేశాడు. చాలా పాత్రలున్నప్పటికీ… ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. కథను అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లరు కావాల్సిన ఎలిమెంట్స్ ని బాగా జోడించాడు. తర్వాతి సీన్ లో ఏం జరుగుతుందా అనే ఆసక్తి కలిగించాడు. ఆద్యంతం సస్పెన్స్ ను మెయింటైన్ చేశాడు. కర్మ సిద్ధాంతాన్ని తన స్టైల్లో చెప్పగలిగాడు. మాఫియా, బెట్టింగ్ నేపథ్యం కొత్త కాకపోయినప్పటికీ… స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ఫ్రెష్ సినిమా చూసిన ఫీలింగ్ తీసుకురాగలిగాడు. సీరియస్ సినిమాగా కాకుండా… అవసరమైన చోట కామెడీ సీన్స్ పండించగలిగాడు. ఈ సీన్ లో మోడీ, రాహుల్ మాస్కులతో సెటైర్ కూడా వేశారు.

సినిమాటోగ్రఫర్‌ సంతోష్‌ షనమోంజ్‌ అందించిన విజువల్స్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఆస్ట్రేలియా అందచందాల్ని చాలా బాగా చూపించాడు. తన కెమెరా వర్క్ తో సినిమాని నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లాడు. గిఫ్టన్ ఎలియాస్ మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా రీ రికార్డింగ్ తో ప్రతి సన్నివేశాన్ని హైలైట్ చేశాడు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది. ఫిలిం అండ్ రీల్ ప్రొడక్షన్స్ నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి.

క్రైమ్ కామెడీ చిత్రాలకు కావాల్సిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అందుకే ఆద్యంతం ఆసక్తి కలిగిస్తుంది. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా కథ రాశారు. దీంతో ఎక్కడా బోర్ అనిపించడు. టైమ్ పీరియడ్ స్టోరీస్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. టైటిల్ కు తగ్గట్టుగా ఒక్కొక్కరి హవా ఒక్కో సమయంలో నడుస్తుంది. ఈ తరహా కథ కథనం ఎప్పుడో గాని రావు… సో గో అండ్ వాచిట్…..

PB Rating : 3.25/5