విశ్వా.. హార్ట్ & సోల్ మ్యూజికల్ ఆల్బమ్ విడుదల

25 ఏళ్ల నా కల సాకారం అయిన రోజు. ఎంతో ఆనందకరమైన రోజు. సాప్ట్ వేర్ రంగంలో ఉన్నా  నా మనసంతా సంగీత రంగం పైనే ఉంది. నా చిన్ననాటి నుండి ఓ అద్భుతమైన మధురమైన సంగీతం కూడిన వీడియో ఆల్బమ్ ను విడుదల చేయాలని ఉండేది. ఆ కల ఇన్నాళ్ల కు ..ఇన్నే ళ్ళకు  నిజమైంది అన్నారు ప్రముఖ సాప్ట్ వేర్ ఇంజినీర్. సంగీత ప్రియులు  డా: విశ్వనాథ్ పత్తార్.  ఆయన ఎంతో పట్టుదలతో సంగీతం లో మెలకువలు నేర్చుకుని. సంవత్సరాల పాటు సాధన చేసి. నేటి యువత కు ఆహ్లదకరమైన వీడియో మ్యూజికల్ ఆల్బమ్ ను రూపొందించినారు. ఈ ఆల్బమ్ ఆవిష్కరణ వేడుక  ప్రసాద్ లాబ్ లో జరిగింది. విశ్వనాథ్  గురువు గారైన  సకల కళ కోవిదులు డా: సురేష్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మాది గురుశిష్య బంధం. తాను ఎన్నాళ్ళు గానో సాధన చేసి  సంగీతం లో సరికొత్త ప్రయోగం చేయాలని అనేవాడు. ఇది వ్యాపార ధోరణిలో కాకుండా  యూట్యూబ్ . ఫేస్ బుక్. ట్విట్టర్. తదితర ప్రసార మాధ్యమాల ద్వారా సంగీత ప్రియులకు అందించాలనే వారు. ఇన్నాళ్లు కు ఆయన కోరిక తీరిందని. కొనియాడారు. మరో ముఖ్య అతిధి సంగీత దర్శకుడు .గాయకుడు.. శశి ప్రితమ్ మాట్లాడుతూ.. తను ఏ రంగంలో పనిచేస్తున్న  . తాను కలగన్న విషయాన్ని నెరవేరాలంటే.. పట్టుదల కావాలి. అలాంటి పట్టుదలతో సాధించిన విశ్వనాథ్ అభినందనియుడు. అబ్దుల్ కలాం గారు అన్నట్లు  కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి. అనే మాట ని నిజం చేసిన విశ్వనాథ్ కి అభినందనలు.. 

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత గా ప్రత్తిపాటి శ్రీనివాస ప్రసాద్ వ్యవహరించారు. సుకృత్ పూజారి. సోనాక్షి వర్మ. ఆశ్రిత్ జాస్మీన్. మణి కుమార్. ప్రదీప్. నిఖిత. సౌమ్య. తదితరులు పాల్గొన్నారు.