టీఆర్ఎస్‌లోకి ప్రముఖ సినీ హీరో

ప్రముఖ సినిమా హీరో ఆకాష్ టీఆర్ఎస్‌లో చేరారు. శుక్రవారం ఫిల్మ్‌చాంబర్ వద్ద జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో ఆకాష్ తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఆకాష్‌కు నాయిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ అమెరికా తరహాలో హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీర్ మంచి ప్రణాళికలు రూపొందిస్తన్నారన్నారు.

నిర్మాతలందరిని ఒకే చోట చేర్చి నిర్మాతల టౌన్‌షిఫ్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇందుకు సహకరించాలన్నారు. ఇక్కడ ఉన్న వాళ్లంతా తమ వాళ్లేనని సీఎం కేసీఆర్ ఎప్పుడో చెప్పారని నాయిని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సినీ ప్రొడ్యుసర్స్ గిల్ట్ అధ్యక్షుడు పి.రామకృష్ణగౌడ్‌కు పార్టీ సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ తెరాస నియోజకవర్గ ఇన్‌చార్జ్ మన్నె గోవర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.