చంద్రమోహన్ ఆరోగ్యం ఓకే: మేనల్లుడు కృష్ణప్రసాద్

ప్రముఖ సీనియర్ సినీనటుడు చంద్రమోహన్ ఆరోగ్యం కుదుటపడుతోందని, ఆయన కోలుకుంటున్నారని ఆయన మేనల్లుడు, ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్ తెలిపారు. చంద్రమోహన్‌కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో గురువారం సాయంత్రం ఆయన్ను జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. రామానాయుడు అంత్యక్రియలు పూర్తయిన వెంటనే చంద్రమోహన్ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఒక్కసారిగా ఆందోళన చెందింది.

అయితే దీనిపై చంద్రమోహన్ మేనల్లుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో చంద్రమోహన్‌కు సర్జరీ జరిగినప్పుడు రెండు స్టంట్స్ వేశారని..వాటిలో కాస్త ఇబ్బంది రావడం వల్లే ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. రెండు రోజుల్లో ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు చెప్పినట్టు ఆయన తెలిపారు.