పవన్ కళ్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకో – హీరో రాజా

పవన్ కళ్యాణ్ మీద ఆనంద్ ఫేం హీరో రాజా విరుచుకుపడ్డాడు. రాజశేఖర్ రెడ్డిని, జగన్ ను ఏమన్నా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఆయన మాట్లాడుతూ….చంద్రబాబు నాయుడు రెండు నాలుకల సిద్ధాంతం కలిగిన వాడు. అలాంటి వ్యక్తితో చేతులు కలిపావు. అధికారమిస్తే ముడు నెలల్లోనే తెలంగాణ ఇస్తామని చెప్పిన బిజెపి పార్టీతో చేతులు కలిపావు. నీకు రాష్ట్రభక్తి, దేశభక్తి ఎంత ఉందో అర్థమవుతోంది. యు ఆర్ మిస్ గైడింగ్ ది యూత్ ఆఫ్ ది స్టేట్ అండ్ కంట్రీ. తప్పుదోవ పట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోమంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీని విలీనం చేసినప్పుడు నువ్వు మాట్లాడలేదు. విభజన సమయంలో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పడు నువ్వేమి మాట్లాడలేదు. జగన్ గారి వల్ల రాష్ట్ర విభజన జరిగిందనడం ఎంత వరకు కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు మరి మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారో అర్థం కావట్లేదు. స్క్రిప్టుల మీద ఆధారపడి మాట్లాడొద్దు. ప్రజల మధ్యకు వచ్చి అవగాహనతో మాట్లాడండి. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మాత్రం చేయకండి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా ఊరుకొని ఉండం. చేతులకు గాజులు తొడుక్కొని లేం. మాట మీద లేనప్పుడు ప్రజాసేవ ఏం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. దయచేసి హద్దులో ఉండి మాట్లాడండి. నటుడిగా మేం అభిమానిస్తాం. కానీ రాజకీయంగా మీరు మాట్లాడే మాటలకు మాత్రం ఊరుకునేది లేదు. అని అన్నారు.