ఇప్పుడు సురేంద‌ర్ రెడ్డి దారి ఎటు..?

రేసుగుర్రం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత కిక్ 2తో పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు సురేంద‌ర్ రెడ్డి. ఈ సినిమా టైమ్ లోనే ర‌చ‌యిత వ‌క్కంతం వంశీతోనూ ఈ ద‌ర్శ‌కుడికి అభిప్రాయ బేధాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఏ సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న త‌రుణంలో త‌ని ఒరువ‌న్ ను రీమేక్ చేసే బాధ్య‌త‌ను రామ్ చ‌ర‌ణ్ ఈ ద‌ర్శ‌కుడికి అప్ప‌గించాడు. ముందు కాస్త కంగారు ప‌డినా.. ఆ త‌ర్వాత ఒప్పుకున్నాడు సూరి. త‌ని ఒరువ‌న్ రీమేక్ చేస్తోన్న ఎక్క‌డ ఆ సినిమాను చెడ‌గొడ‌తారేమో అని విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు ప్రేక్ష‌కుల్లో కంగారుగానే ఉంది. కానీ ఇప్పుడు ధృవ ఔట్ క‌మ్ చేసిన త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డిని మెచ్చుకుంటున్నారు అంతా. రామ్ చ‌ర‌ణ్ ను ఆ పాత్ర కోసం సురేంద‌ర్ రెడ్డి మ‌లిచిన తీరు ప్ర‌శంస‌లు కురిపిస్తోంది.
మ‌రీ ముఖ్యంగా మేకింగ్ ప‌రంగా త‌మిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ స్టైలిష్ గా ఉంది సినిమా. ఇక్క‌డ పిఎస్ వినోద్ త‌న కెమెరా వ‌ర్క్ తో సినిమా రేంజ్ పెంచేసాడు. ఇక సురేంద‌ర్ రెడ్డికి ఎలాగూ స్టైలిష్ మేక‌ర్ గా పేరుంది. దాంతో త‌న టాలెంట్ మొత్తం ఈ థ్రిల్ల‌ర్ మూవీలో చూపించేసాడు. ఒరిజిన‌ల్ ను చెడ‌గొట్ట‌కుండా.. త‌న‌దైన స్టైల్ లో మెప్పించాడు. ఇక ఇప్పుడు అంద‌రి సందేహం ఒక్క‌టే. సురేంద‌ర్ రెడ్డి త‌ర్వాతి సినిమా ఏంటి..? చిరంజీవితో సినిమా ఉంద‌ని చెప్పి షాకిచ్చాడు సూరి. మ‌రి ఆ సినిమా వైపు వెళ్తాడా.. లేదంటే అఖిల్ సినిమాతో స‌ర్దుకుపోతాడా.. అదీ కాదంటే సొంత క‌థ రాసుకుని మ‌ళ్లీ చ‌ర‌ణ్ ద‌గ్గ‌రికే వెళ్తాడా..? ఏమో చూడాలి మ‌రి.. ఈ ద‌ర్శ‌కుడి ప్ర‌యాణం ఎటు వైపో ఇప్పుడు..?