మహానగరంలోని చెరువుల సుందరీకరణ పై దృష్టి పెట్టిన మంత్రి హరీష్ రావు

ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు సీటి లేక్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సాగునీటి సలహాదారు ఆర్ విద్యాసాగర్, జిహెయంసీ ఛీఫ్ ఇంజనీర్ సురేష్ కుమార్, లేక్స్ ఎస్సి శేఖర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎస్సి వేంగటేశం, డిసీఇ లు వేణు, రమేష్ లతో పాటు ఒఎస్డీ శ్రీదర్ రావు దేశ్ పాండేలు పాల్గోన్నారు.

మహానగరంలోని చెరువుల సుందరికరణ పై దృష్టి పెట్టారు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. భాగ్యనగరంలో ఫ్రారంభించిన చెరువు పనులను యుద్దప్రాతిపధికన పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి హరీష్ రావు. జిహెచ్ యంయసీ 625 చరరపు కీలో మీటర్ల పరిధిలో 169 చెరువులు ఉన్నాయి. వీటిలో జంట నగరాల పరిధిలో 26 చెరువులు, రంగారెడ్డిలో 133 చెరువులు , మెదక్ లో 10 చెరువులు ఉన్నాయి. వీటిని కబ్జాల భారీ నుండి రక్షించి, పరిరక్షించి, పునరుద్దరించి, సుందరికరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే 155 చెరువుల సర్వే పూర్తయిందని అధికారులు మంత్రి హరీష్ రావు కు తెలిపారు. మిగత 14 చెరువుల సర్వేను ఢిఫైన్స్, రెవెన్యూ అధికారుల సహకారంతో వచ్చే నెల రోజుల్లో పూర్తి చేయాలని అదేశించారు. సర్వేలు పూర్తయిన 155 చెరువులకు గాను 64 చెరువులకు ప్రభుత్వ అనుమతి ఇచ్చిందని, ఇందుకోసం 100 కొట్ల రూపాయలను ప్రభుత్వం మంజురు చేసిందని మంత్రి తెలిపారు. ఈ పనులను ఎక్కడా జాప్యం లేకుండ ప్రారంభించి పూర్తి చేయాలని మంత్రి అన్నారు. అయితే 37 చెరువులు టెండర్ ప్రక్రియ ను పూర్తి చేసుకున్నట్టు మంత్రి హరీష్ రావుకు అదికారులు వివరించారు. 14 చెరువుల్లో పనులు ప్రారంభమైన సంగతిని తెలిపారు. మరో 12 చెరువుల్లో అగ్రిమెంట్లు పూర్తి చేసుకొని పని ప్రారంభించాడానికి సిద్దంగా ఉన్నాట్టు అధికారులు మంత్రికి వివరించారు. అయితే అగ్రిమెంట్లు పూర్తి చేసుకున్నా చెరువుల్లో వారం రోజుల లోపు పనులు ప్రారంభం కావలని మంత్రి హరీష్ రావు అధికారులకు అదేశించారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నా 37 చెరువుల పనులల్లో కూడా వేగన్ని పెంచాలని మంత్రి అన్నారు.

మహా నగరంలో చెరువులను కబ్జాలకు పాల్పాడే వారి విషయంలో రాజకీయ లకు అతితంగా చర్యలు తీసుకొవాలని మంత్రి అధికారులకు అదేశాలు జారీ చేశారు. ముంజూరి అయిన పనుల్లో అలస్యం జరగుతున్న తీరు పై అగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. నిర్ధారించిన టైంలో పనులు పూర్తి చేయకపోతే కఠిణంగా వ్యవహరించాల్సి ఉంటుందని మంత్రి అధికారులను హెచ్చరించారు.

నిన్న రామంతపూర్ లోని చిన్న చెరువు, పెద్ద చెరువును మంత్రి సందర్శించిన సంగతి తెలిసిందే. స్ధానిక ప్రజలు, గంగా పుత్ర సంఘం వారు ఇచ్చిన విజ్నప్తులను ఈ సమావేశం సందర్భంగా చర్చించారు. చిన్న చెరువు, పెద్ద చెరువులకు సంబందించిన ఎస్టిమెట్లను తయరు చేసి పనులను ప్రారంభించాలని మంత్రి అధికారులతో అన్నారు.

జిహెచ్ యంసీ పరిధిలోని చెరువుల నిర్మాణానికి అడ్డంకిగా మారిన లీగల్ సమస్యలను పరిష్కరించుకొవాలని మంత్రి అన్నారు. అందుకోసం అడ్వకేట్ జనరల్ ను తక్షణమే సంప్రదించి సమస్యలను పరిష్కరించుకొవాలని మంత్రి సూచించారు. ఈ విషయంలో సాగు నీటి సలహాదారు విద్యాసాగర్ రావు గారి సహాయ సహకరాలు తీసుకొవాలని మంత్రి అధికారులను అదేశించారు.
జిహెచ్ యంసీ పరిధిలోని చెరువుల నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో భాగంగా కొత్తగా వాట్స్ యాప్ గ్రూప్ ను తయరు చేశారు.