హైదరాబాద్ నవాబ్స్ 2 మూవీ రివ్యూ….

2006 లో వచ్చిన హైదరాబాద్ నబాబ్ సినిమాకు సీక్వెల్ గా హైదరాబాద్ నవాబ్స్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. డెక్కన్ ఫిల్మ్స్ కి క్రేజ్ బాగా ఎక్కువ. దీంతో ఈ సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్.కె.నిర్మించి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే…. రియల్ ఎస్టేట్ మాఫియాలో చిక్కుకున్న కుటుంబాల కథే నవాబ్ 2. ముందు వెనక ఆలోచించకుండా తక్కువలో ఇళ్లు వస్తుంది కదా అని ఇరుక్కుపోతారు. బిల్డర్స్ పట్టించుకోకపోవడంతో రోడ్డున పడతారు. ఓక్కో ఫ్యామిలీది ఓక్కో స్టోరీ ఉంటుంది. చివరికి వీరంతా కలిసి బిల్డర్స్ పని ఎలా పట్టారన్నది కామెడీగా చెప్పారు. వీరికి మామ ఎలా హెల్పయ్యాడు. విలన్స్ బ్యాచ్ నుంచి ఎలా తప్పించుకున్నారది అసలు కథ.

సమీక్ష
రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ సినిమా కథ రాయడం జరిగింది. ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. రెండు గంటలు నాన్ స్టాప్ గా నవ్వుకునేలా ఆర్.కె.దర్శకత్వం వహించారు. సాధారణంగా మన కుటుంబాల్లో చూసే సందర్భాల్నే మరింత ఫన్నీగా తీర్చిదిద్దారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఇందులో చాలా మంది కొత్త ఆర్టిస్టులున్నప్పటికీ… సీనియర్ నటీనటుల్లా నటించారు. ప్రతీ సీన్ ను పండించేందుకు ట్రై చేశారు. గతంలో వచ్చిన హైదరాబాద్ నవాబ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా కామెడీ వర్కవుట్ చేయగలిగారు. హీరోలు, హీరోయిన్స్ అందరూ చాలా బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ అందించిన పాటలు సినిమాకు బాగా హెల్పయ్యాయి. రీ రికార్డింగ్ కూడా బాగుంది. మంచి హాట్ హాట్ ఐటమ్ సాంగ్స్ మాస్ ని మెప్పిస్తాయి. హైదరాబాద్ లోకల్ కల్చర్ ను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆలీ రజత్ హ్యాండ్ సమ్ గా కనిపించడమే కాదు తన పెర్ ఫార్మెన్స్ తో ఆక్టటుకున్నాడు. కామెడీ బాగా చేశాడు. హీరో అజీజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోసారి తనదైన కామెడీతో నవ్వించాడు. పప్పూ పాత్రలో మెప్పించాడు. రియల్ ఎస్టేట్ మీడియేటర్ పాత్రలో హీరోయిన్ ని పడేసే పాత్రలో తన స్నేహితుడికి వచ్చిన సమస్యను తీర్చే క్యారెక్టర్లో చాలా బాగా నటించాడు. రఘు పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. తనదైన కామెడీతోఅలరించాడు. ఇక ఆర్.కె. మామ పాత్రలో కథకు కీలకమైన సీన్స్ లో కనిపించారు. హీరోయిన్ ఫరా ఖాన్ క్యారెక్టర్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంది. పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉంది. సూఫీఖాన్, సమైరా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసింది. విలన్ క్యారెక్టర్ తో పాటు చిన్న చిన్న పాత్రలు చేసిన వారు కూడా తమ పాత్రల్లో జీవించారు. టెక్నికల్ గా క్వాలిటీ సినిమా రూపొందించారు.

ఫైనల్ గా…
ఈ తరహా సినిమాకు మనకు అరుదుగా వస్తుంటాయి. హైదరాబాదీ సినిమాలంటే ఉండే క్రేజ్ వేరు. ఆ క్రేజ్ కి తగ్గట్టుగా పాత్రల్ని తీర్చిదిద్దారు దర్శకుడు ఆర్.కె. ఓ పైపు సినిమాలో మామ పాత్రలో నటిస్తూనే దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు చేపట్టి సక్సెస్ సాధించాడు. డెక్కన్ ఫిల్మ్స్ కేటగిరీలో మరో హిట్ సినిమా రూపొందించాడు. సరదాగా రెండు గంటలు నవ్వుకుంటూ కాలక్షేపం చేసే సినిమా ఇది. రియల్డర్స్ చేసే దందాను ఓపెన్ గా చూపించాడు. అనధికారిక కట్టడాల వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూపించారు. ఓ ఇళ్లు కొనే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలో కామెడీగా బాగా చెప్పారు. సహజంగా ఉండేలా అవసరమైన చోట తెలుగు డైలాగ్స్ వస్తాయి. అందుకే పక్కా హైదరాబాదీ సినిమాగా చెప్పొచ్చు. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5