ఐ మూవీ త్రీ డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

చియాన్ విక్రమ్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఐ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. సినిమా తొలుత డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా శంకర్ టేకింగ్-విక్రమ్ నటన-భారీ టెక్నాలజీ-అమీ అందాలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఏ సెంటర్లతో పాటు బీ, సీ సెంటర్లలో కూడా సినిమాను చూసేందుకు ప్రేక్షకులు భారీగా వస్తుండడంతో సినిమా టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. టాలీవుడ్‌లో ఓ డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం ఇదే ప్రథమం. దీంతో ఐ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ కలెక్షన్లు సోమవారం వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే ఐ మూవీ మరిన్ని కొత్త రికార్డులు టాలీవుడ్‌లో క్రియేట్ చేసే అవకాశం ఉంది. 

ఐ మూవీ మూడు రోజులు కలెక్షన్స్ రిపోర్ట్:
నైజాం- 5.46 కోట్లు
సీడెడ్- 3.47 కోట్లు
వైజాగ్- 1.25 కోట్లు
ఈస్ట్- 1.23 కోట్లు
వెస్ట్- 1.10 కోట్లు
కృష్ణా- 1.00 కోట్లు
గుంటూరు- 1.56 కోట్లు
నెల్లూరు- 0.88 లక్షలు
—————-
ఏపీ+తెలంగాణలో మూడు రోజులకు మొత్తం రూ.15.95 కోట్లు వసూలు చేసింది.