టీం ఇండియాకు బంగ్లా మీడియాలో అవ‌మానం…అర‌గుండుతో క్రికెట‌ర్లు

భార‌త జ‌ట్టుపై తొలిసారిగా సొంత‌గ‌డ్డ‌పై వ‌న్డే సీరిస్ గెలుచుకున్న బంగ్లాదేశ్‌లో సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. అయితే బంగ్లా గెల‌వ‌డంతో అక్క‌డ ఆ దేశ ప్ర‌జ‌ల‌తో పాటు మీడియా కూడా ఓవ‌రాక్ష‌న్ చేయ‌డంతో పాటు మ‌న‌దేశ క్రికెట‌ర్ల‌ను అవ‌మాన‌ప‌రిచే విధంగా అక్క‌డ మీడియా ప్ర‌వ‌ర్తిస్తోంది. బంగ్లా సీరిస్ గెలుచుకున్న రోజు ఓ భార‌త క్రికెట్ వీరాభిమానిపై బంగ్లా అభిమానులు దాడికి దిగారు. ఈ సంఘ‌ట‌న మ‌ర‌చిపోక‌ముందే మ‌న క్రికెట్ జ‌ట్టుకు మ‌రో అవ‌మానం ఎదురైంది.

బంగ్లా ప్రముఖ పత్రిక పోతమ్ అలో వీక్లీ మ్యాగజైన్ రోష్ అలోలో క్రీడాస్ఫూర్తిని పూర్తిగా మరిచిపోయింది. టీమిండియాను అవమానపరిచేలా ఓ వ్యంగ్యాత్మక కటౌట్ ప్రకటించింది. ఆ కటౌట్‌ ఆఫ్ కటర్లుగా భారత ఆటగాళ్లు యువ బౌలర్ ముస్తాఫిజుర్ ఓ కటర్ పట్టుకుని ఉన్నాడు. టైగర్‌ స్టేషనరీ, మేడ్‌ బంగ్లాదేశ్‌, మిర్పూర్‌ స్టేడియం మార్కెట్లో ముస్తాఫిజుర్‌ కటర్‌ దొరుకుతుంది అని బోర్డులో రాసి ఉంది.

ముస్తాఫిజుర్ ఫొటో కింద రహానె, రోహిత్‌ శర్మ, కోహ్లీ, ధోనీ, ధవన్‌, జడేజా, అశ్విన్‌లు అరగుండులతో ఓ బ్యానర్‌ పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ బ్యానర్‌పై మేం ఉపయోగించాం. మీరూ వాడండి అని రాశారు. ఈ క‌టౌట్ ఇరుదేశాల మ‌ధ్య క్రీడాస్ఫూర్తిని దెబ్బ‌తీసేలా ఉంద‌ని…ఇది ఇరు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు తెచ్చేలా ఉంద‌న్న అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.