ఐపీఎల్-8 వేలం…యువరాజ్‌కు రికార్డు రేటు

ఐపీఎల్-8 వేలంలో భారత మాజీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్‌సింగ్ రికార్డు నెలకొల్పాడు. గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన యువరాజ్ అప్పుడు రూ.14 కోట్లకు అమ్ముడయ్యాడు. తాజా వేలంలో యువరాజ్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ.16 కోట్లకు కొనుక్కుంది. రూ.2 కోట్ల కనీస ధరతో ప్రారంభమైన యువరాజ్‌ను దక్కించుకునేందుకు పలు ఫ్రాంఛైజీలు పోటీపడడంతో రేటు అనూహ్యంగా పెరిగింది. చివరకు యువరాజ్‌ను భారీ రేటుకు ఢిల్లీ సొంతం చేసుకుంది. 

ఈ వేలంలో మొత్తం 334 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. మురళీవిజయ్‌ను రూ.3 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. లంక కెప్టెన్ మాథ్యూస్‌ను రూ.7 కోట్లకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ దక్కించుకుంది. దినేష్‌కార్తీక్‌ను రూ 10.5 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్, పీటర్సన్‌ను రూ.2 కోట్లకు, న్యూజిలాండ్ ఆటగాడు విలియంసన్‌ను రూ.60 లక్షలకు హైదరాబాద్ దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్‌ఫించ్‌ను ముంబై ఇండియన్స్ రూ 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అమిత్‌మిశ్రాను రూ 3.5 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకుంది. 

ఇప్పటి వరకు ఐపీఎల్-8 వేలంలో యువరాజ్‌దే అత్యధిక ధర. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక రేటు అయ్యే అవకాశం ఉంది.