ఐపిఎల్ కోసం హృతిక్, అనుష్క ఆటపాట… గ్రాండ్ లాంచ్

వరల్డ్ కప్ అలా ముగిసిందో లేదో ఐపిఎల్ హంగామా మొదలు కానుంది. ఈసారి ఐపిఎల్ మరింత కలర్ ఫుల్ గా ఉండనుంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐపిఎల్ సీజన్ 8 ప్రారంభోత్సవ వేడుకల కోసం టాప్ బాలీవుడ్ స్టార్స్ రానున్నారు. ఏప్రిల్ 7న కోల్ కతాలో జరిగే ఈ వేడుకల్లో హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, ఫర్హాన్ అక్తర్, అనుష్క శర్మ తదితరులు తమ ఆటపాటలతో సందడి చేయనున్నారు.

అంతేకాదు సైఫ్ అలీ ఖాన్ ఈ ఓపెనింగ్ ఈవెంట్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఖరారు చేశారు.

ఏప్రిల్ 8నుంచి ఐపిఎల్ మ్యాచులు ప్రారంభమౌతాయి. కాగా కోల్ కత నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ట్రోఫీని ప్రారంభోత్సవం జరిగే  స్టేడియంలోకి తీసుకొస్తారు.