ఇష్టంగా మూవీ రివ్యూ

ఇష్టంగా మూవీ రివ్యూ

అర్జున్ మహీ హీరోగా నటిస్తున్న మూడో చిత్రం. ఈ సినిమా తన కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ సినిమా. అందుకే చాలా కేర్ ఫుల్ గా విభిన్నమైన ట్రెండీ సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు. సహజీవనం నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. అర్జున్ మహి , తనిష్క్ రాజన్ , ప్రియదర్శి, దువ్వాసి మోహన్ కీలక పాత్రలు పోషించారు. సంపత్ వి రుద్ర దర్శకుడు. నిర్మాత వెంకటేశ్వరరావు. మరి ఈ ప్రేమ కథ ప్రేక్షకుల్ని ఎలా మెప్పించిందో చూద్దాం.

కథేంటంటే

కృష్ణ (అర్జున్ మహి ) కొరియోగ్రాఫర్. వెబ్ సైట్ కి కంటెంట్ రైటర్ గా పనిచేసే సత్య ను (తనిష్క్ రాజన్ ) ప్రేమిస్తాడు. సత్య కూడా కృష్ణను ప్రేమిస్తుంది. ఇద్దరూ ఘాఢ ప్రేమలో ఉండగానే పెళ్లి టాపిక్ వస్తుంది. కానీ సహజీవనం మాత్రం చేద్దామంటాడు కృష్ణ. ఆ తర్వాత సత్య కూడా లివింగ్ రిలేషన్ షిప్ మెయంటైన్ చేయడానికి ఒప్పుకుంటుంది. కానీ అదే టైంలో అనుకోని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన తర్వాత కలిసున్నారా. విడిపోయారా. చివరికి వీరి ప్రేమ, లివింగ్ రిలేషన్ షిప్ ఎక్కడికి దారి తీసిందనేది అసలు కథ.

సమీక్ష
ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ హీరో అర్జున్ మహి. తనదైన పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా లవ్ సీన్స్ లో తన టాలెంట్ చూపించాడు. కొరియోగ్రాఫర్ ని తలపించే హెయిర్ స్టైల్ తో స్టైలిష్ గా కనిపించాడు. హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేస్తాడు. రొమాంటిక్ సీన్స్ లో హాట్ గా కనిపించారిద్దురూ. హీరో అర్జున్ క్లైమాక్స్ లో నటన బాగుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అయిన విధానం బాగుంది. హీరోయిన్ తనిష్క్ అటు అభినయం, ఇటు అందంతో మెప్పించింది. ముఖ్యంగా గ్లామర్ గా కనిపించి హాట్ గా రొమాంటిక్ సీన్స్ లో కనిపించింది. లిప్ కిస్ సీన్స్ ని కూడా బాగా పిక్చరైజ్ చేశారు. మరో వైపు ప్రియ దర్శి, దువ్వాసి మోహన్ కామెడీ తో నవ్వించారు.

ప్రథమార్థం దర్శకుడు యూత్ ఫుల్ గా రొమాంటిక్ గా తీసుకెళ్లిన దర్శకుడు సెకండాఫ్ ని ఎక్కువగా ఎమోషనల్ సీన్స్ తో నింపేశాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకునే సీన్స్ తో రూపొందించాడు. ముఖ్యంగా మహిళల గురించి చెప్పిన డైలాగ్స్, సీన్స్ ఎమోషనల్ గా బాగున్నాయి.
ఓ వైపు యూత్ ని టార్గెట్ చేస్తూనే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే సీన్స్ రాసుకున్నాడు. మహావీర్ అందించిన సంగీతం బాగుంది . ముఖ్యంగా అద్నాన్ సమీ పాడిన టైటిల్ ట్రాక్ గుర్తుండిపోతుంది. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ ను తీసుకొచ్చింది. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాగుంది. పర్వాలేదు. నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు చాలా గ్రాండియర్ గా వున్నాయి.

ఫైనల్ గా.. నేటి జనరేషన్ తప్పకుండా చూడాల్సిన సినిమా. లివింగ్ రిలేషన్ షిప్ కు సరికొత్త అర్థం ఇచ్చిన సినిమా ఇది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. యూత్ ని బాగా ఆకట్టుకునే సినిమా ఇది. సో గో అండ్ వాచ్.

PB Rating : 3/5