తెలుగు ఇండస్ట్రీలో ఇస్మార్ట్ పోరీ నభా నటేష్ దూకుడు

తెలుగు ఇండస్ట్రీలో ఇస్మార్ట్ పోరీ నభా నటేష్ దూకుడు..

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది నభా నటేష్. ఇప్పుడు ఈ టైటిల్ కు తగ్గట్లుగానే అందరి మనసులు దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాలో చాలా పద్దతిగా కనిపించిన ఈ భామ.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా గేర్లు మార్చేసింది. ఈ సినిమాలో రామ్ సరసన నటించింది నభా. తన సోకులతో మాయ చేసింది. ముఖ్యంగా తెలంగాణ యాసలో కుమ్మేసింది నభా నటేష్. ఇందులో నభా చేసిన కారెక్టర్ కు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. పైగా ఈ సినిమాతో తనకు వచ్చిన గుర్తింపు చూసి నభా కూడా గాల్లో తేలిపోతుంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత నభా నటేష్ డేట్స్ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నారు. దానికి తోడు అందాల ఆరబోతలో కూడా అమ్మడు ఫుల్లుగా కిక్ ఇచ్చేసరికి ఇప్పుడు స్టార్ హీరోల కన్ను కూడా నభాపై పడుతుంది. వరస అవకాశాలతో ఈమె కెరీర్ కు బంగారు బాటలు వేస్తున్నారు వాళ్లు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కో రాజాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది నభా నటేష్. విఐ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అమ్మడి దశ మొత్తం మారిపోయింది. ఈ క్రేజ్ సరిగ్గా వాడుకుంటే స్టార్ హీరోయిన్ కావడానికి ఎన్నో రోజులు కూడా పట్టకపోవచ్చు.