ముందెనక సూస్కొనుడే లేదు…

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ముందు వెన‌క చూసుకోకుండా కుమ్మేస్తున్నాడు రామ్. ఈయ‌న న‌టించిన ఇస్మార్ట్ శంక‌ర్ ఇన్నేళ్ల క‌రువు మొత్తాన్ని తీర్చేసింది. అసలు పూరీ జ‌గ‌న్నాథ్ కోరుకున్న దానికంటే ఎక్కువే ఇస్తున్నాడు ఈ శంక‌ర్. తొలిరోజు వ‌చ్చిన టాక్ చూసి సినిమా హిట్ అవుతుంద‌ని క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నారు కానీ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌నే న‌మ్మ‌కం మాత్రం ఎవ‌రిలో లేదు. కానీ 12 రోజులు గ‌డిచేస‌రికి సీన్ అంతా మారిపోయింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 33 కోట్లు షేర్ వ‌సూలు చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల్లోనే 31 కోట్ల‌కు పైగా షేర్ ఉండ‌టం విశేషం. ఇప్ప‌టికే డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిపోయింది ఇస్మార్ట్ శంక‌ర్. 17 కోట్లకు మాత్రమే బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు సంచలన విజయం సాధించింది. ఓవ‌ర్సీస్ లో ఫ్లాప్ అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ర‌ప్ఫాడిస్తుంది ఈ చిత్రం. పూరీ కూడా టెంప‌ర్ త‌ర్వాత స‌రైన హిట్ కోసం చూస్తున్నాడు. ఇలాంటి త‌రుణంలో వ‌చ్చిన ఈ చిత్రం ఆయ‌న ఆక‌లి మొత్తాన్ని తీర్చేసింది. రామ్ కూడా ఈ చిత్ర విజ‌యాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం స్పెయిన్ ఉన్న ఈయ‌న‌.. మరికొన్ని గంటల్లో ఇండియాకు రానున్నాడు. వ‌చ్చిన త‌ర్వాత భారీ స‌క్సెస్ స‌భ ఒక‌టి ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దానికితోడు డియర్ కామ్రేడ్ సినిమా పరాజయం కావడం రామ్ కు కలిసొచ్చింది.