విడుదలకు సిద్ధమౌతున్న ఇట్స్ మై లైఫ్

యశశ్విని రీల్స్ బేనర్ మీద వస్తున్న ఇట్స్ మై లైఫ్ ( మా జీవితం మా ఇష్టం ) చిత్రంలో కొత్త ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు కోటా శ్రీనివాస రావు, రఘు బాబు, కాశీవిశ్వనాథ్, సూర్య, మెల్కోటి, సి.వి.ఎల్ తదితరులు నటిస్తున్నారు. 

ఈ చిత్రం ఎడ్యుకేషన్ సిస్టం మీద, యువత ఇష్టా ఇష్టాల మీద తీసిన చిత్రం. ఇప్పుడున్న విద్యావ్యవస్థలో ఎల్.కె.జీ వాళ్లు మోయలేనన్ని బుక్స్, పదోతరగతి, ఇంటర్ నుంచి చదవలేనంత సిలబస్ తో సతమతమవుతున్నారు. ఈ చిత్రాన్ని చూడటం ద్వారా ఇట్టు స్టూడెంట్స్ కి, ఇటు పేరెంట్స్ కి చదువుల ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. మనిషిలో ఒత్తిడిని తగ్గించిడమే ఈ సినిమా యొక్క ఎంటర్ టైన్ మెంట్. తప్పక చూడవలసిన చిత్రమిది. ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. 

 

  • సంగీతం – ఎస్.ఆర్.శంకర్
  • కెమెరామెన్ – యన్.సుధాకర్ రెడ్డి
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – తుమ్మల భిక్షపతి
  • కో డైరెక్టర్ – యమ్.నానిబాబు
  • మాటలు – కొప్పెర కిరణ్ కుమార్
  • ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరరావు
  • కో ప్రొడ్యూసర్ – యమ్.కొండలరావు
  • నిర్మాణ సారధ్యం – వి.శివకుమార్
  • నిర్మాత – ఎస్.ఎస్.నాయుడు
  • రచన, దర్శకత్వం- రామినేని నేతాజి