ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ డిస్క‌ష‌న్

యావ‌రేజ్ సినిమా.. తొలిరోజు జ‌న‌తా గ్యారేజ్ కు వ‌చ్చిన టాక్. కానీ ఇప్పుడొస్తున్న క‌లెక్ష‌న్ల‌కు టాక్ కు ఏ మాత్రం పోలిక లేదు. అస‌లు టాక్ తో ప‌ని లేద‌న్న‌ట్లు వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది ఈ సినిమా. ఇప్ప‌టికే నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నింటినీ త‌న పేర రాసుకున్నాడు యంగ్ టైగ‌ర్. నాలుగో రోజే 50 కోట్ల క్ల‌బ్ లో అడుగు పెట్టిన ఎన్టీఆర్.. ఆ త‌ర్వాత కూడా దూకుడు త‌గ్గించ‌ట్లేదు. వీక్ మ‌ధ్య‌లో కూడా వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్నాడు. వ‌సూళ్ళ ప‌రంగా జ‌న‌తా గ్యారేజ్ ఇప్ప‌టికే చాలా రికార్డుల‌ను సెట్ చేసింది. తొలి ఆరు రోజుల్లో కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే 44 కోట్లు వ‌సూలు చేసింది జ‌న‌తా గ్యారేజ్.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌తా గ్యారేజ్ వ‌సూళ్లు 60 కోట్లు దాటిపోయింది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో 11 కోట్లు వ‌సూలు చేసిన జ‌న‌తా.. క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, రెస్టాఫ్ ఇండియాలో క‌లిసి మ‌రో 15 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్ప‌టికే ఆరు రోజుల్లో జ‌న‌తా గ్యారేజ్ 64 కోట్లు వ‌సూలు చేసింది ఈ సినిమా. బుడ్డోడికి యావ‌రేజ్ సినిమా ప‌డితేనే ఇలా ఉన్నాయి వ‌సూళ్లు.. అలాంటిది నిజంగా బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డితే ప‌రిస్థితి ఎలా ఉంటుందో మ‌రి.. ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ డిస్క‌ష‌న్. ఇన్నాళ్లూ ఎన్టీఆర్ స్టామినా గురించి మాట్లాడిన వాళ్ల‌కు జ‌న‌తా గ్యారేజ్ స‌మాధానంగా నిలిచింది. ఇక చూడాలి.. ఈ దూకుడు ఇంకెంత దూరం వెళ్తుందో.. జ‌న‌తా ఇంకెన్ని రికార్డుల‌కు చెక్ పెడుతుందో..?