మోడీ-జశోదాబెన్ కలుస్తారా.. భర్తతో కలిసుండాలని జశోదాబెన్ ఆకాంక్ష

భారత ప్రధాని నరేంద్రమోడీతో తాను కలిసుండాలని కోరుకుంటున్నట్టు మోడీ భార్య జశోదాబెన్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. మోడీ తనను ఒక్కసారి పిలిస్తే సంతోషంగా వెళ్లి జీవితాంతం ఆయనకు సేవ చేసుకుంటానని జశోదాబెన్(64) తెలిపారు. 43 ఏళ్లుగా తన భర్తతో విడిగా ఉంటున్నా తన భర్తపై మమకారం తగ్గలేదని ఆమె స్పష్టం చేశారు. 1968లోనే మోడీకి 17 ఏళ్ల వయస్సులో జశోదాబెన్‌తో వివాహమైంది. అయితే దీనిపై జశోదా మాట్లాడుతూ ఆయన వడోదర లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు భార్యగా తన పేరును పేర్కొన్నప్పుడు తన కళ్లల్లో నీళ్లు చెమ్మగిల్లాయని తెలిపారు. ఇప్పటకీ ఆయన మనస్సులో తనకు స్థానం.. ప్రేమ ఉందని ఆ విషయం తనకు తెలుసని ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె వ్యాఖ్యలతో మళ్లీ వీరిద్దరు కలుస్తారా లేదా అన్నదానిపై పలు రకాల వార్తలు వస్తున్నాయి.

ప్రధాని భార్యగా తన విధులేమిటి… ఆర్టీఐకి జశోదా దరఖాస్తు…
ప్రస్తుతం ఆమె సాధారణంగా ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుంటే ఆమెకు ప్రొటోకాల్ ప్రకారం భద్రత కల్పించడానికి వెనక ఓ వాహనంలో సెక్యూరిటీ సిబ్బంది వస్తున్నారు. ఆమె ఎక్కడకు వెళ్లినా ఈ విచిత్ర పరిస్థితి ఎదురవుతుండడంతో ఆమె కాస్త చికాకు వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఆమె ఆటోలో వెళుతున్నా కూడా వారు కారుతో వెనకాల ఫాలో అవుతున్నారట. 


దీంతో ఆమె తనకు ఏ హాదా కింద భద్రత కల్పిస్తున్నారో చెప్పాలని సమాచార హక్కు చట్టం కింద సోమవారం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. తనకు భద్రత ఉన్న అధికారుల పూర్తి వివరాలు ఇవ్వాలని, తనకు ఇస్తున్న సెక్యూరిటీ విషయంలో భయపడుతున్నట్టు కూడా ఆమె తెలిపారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె సెక్యూరిటీ గార్డులే చంపారు.. ఈ విషయంలో నాకు వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆమె దరఖాస్తులో పేర్కొన్నారు.