రివ్యూ: జ‌య జాన‌కి నాయ‌క‌

టాలీవుడ్‌లో మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కేరాఫ్ అయిన బోయ‌పాటి శ్రీను లెజెండ్‌, స‌రైనోడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లేటెస్ట్ మూవీ జ‌య జాన‌కి నాయ‌క‌. అగ్ర‌నిర్మాత బెల్లంకొండ సురేష్ త‌న‌యుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాతోనే తానేంటో ఫ్రూవ్ చేసుకున్నా ఆ సినిమ క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేదు. ఇక శీను రెండో సినిమా స్పీడున్నోడు డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ ‌మంలోనే త‌న మూడో సినిమాతో బోయ‌పాటితో జ‌ట్టుక‌్టి జ‌య జాన‌కి నాయక సినిమా చేశాడు. టీజర్‌, ట్రైల‌ర్ల‌తో పాటు పాట‌ల‌తో రిలీజ్‌కు ముందే భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయ్యింది. మ‌రి ఈ సినిమాతో బోయ‌పాటి, శీను స‌క్సెస్ కొట్టారా ? లేదా ? అన్న‌ది ఐడ్రీమ్ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టొరీ….

హీరో గగన్‌(బెల్లంకొండ శ్రీనివాస్‌)కు కుటుంబం అంటే చాలా ఇష్టం. ాన్న చక్రవర్తి (శరత్‌కుమార్‌) అన్నయ్య(నందు)లంటే అత‌నికి ప్రాణం. కాలేజ్‌లో ఓ సీన్‌లో గ‌గ‌న్ చేసిన ప‌నితో స్వీటి (ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌తారు. వీరి లైఫ్ జాలీగా సాగిపోతున్న టైంలో స్వీటి పెద్ద ప్ర‌మాదంలో ఉంద‌న్న విష‌యం గ‌గ‌న్‌కు తెలుస్తుంది. ఆమెను చంపాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఈ విష‌యం తెలుసుకున్న గ‌గ‌న్ స్వీటిని ఎలా ర‌క్షించాడు. ఆమెకు అశ్వింత్‌ నారాయణ (జగపతిబాబు)కీ ఉన్న సంబంధం ఏమిటి ? అస‌లు ఆమెను ఎందుకు చంపాలనుకుంటున్నారు ? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ సినిమా.

 న‌టీన‌టుల పెర్పామెన్స్‌:

న‌ట‌నాప‌రంగా హీరో శ్రీనివాస్ గ‌గ‌న్ రోల్‌లో డ్యాన్సులు, ఫైట్ల‌ లో మెప్పించాడు. భారీ డైలాగ్స్ కి శ్రీను న్యాయం చేసాడు. ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో అత‌డి న‌ట‌న సూప‌ర్బ్‌. స్వీటి రోల్‌లో ర‌కుల్‌ప్రీత్‌సింగ్ అటు అందంతోను ఇటు అభిన‌యంతోను మెప్పించింది. సినిమాకు గుండె కాయ‌లాంటి రోల్‌లో ర‌కుల్ త‌న పాత్ర‌ను స‌మ‌ర్థ‌వంతంగా పోషించింది.

ఇటీవ‌ల వ‌రుస‌గా అన్ని సినిమాల్లోను గ్లామ‌ర్ పెర్పామెన్స్‌తో మెప్పిస్తోన్న కేథ‌రిన్ ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో కిక్ ఇచ్చింది. ఇక మ‌రో హీరోయిన్ ప్ర‌గ్య జైశ్వాల్ కూడా అందంతో అల‌రించ‌డంతో పాటు  ‘ డిస్కో బాబు డిస్కో’ అనే బీచ్ సాంగ్‌లో చాలా అందంగా ఉంది. శ‌ర‌త్‌కుమార్ పాజిటివ్‌రోల్‌లో మెప్పిస్తే, జ‌గ‌ప‌తిబాబు మ‌రోసారి క్రూర‌మైన స్టైలిష్ విల‌న్‌గా పాత్ర‌కు న్యాయం చేశాడు. నందూకి కూడా మంచి పాత్రే ద‌క్కింది. ఇక చాలా కాలం త‌ర్వాత తెలుగు తెర‌పై మెరిసిన వాణీ విశ్వ‌నాథ్‌కు విభిన్నమైన పాత్ర దక్కింది. 

విశ్లేష‌ణ‌:
బోయపాటి శ్రీను సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్‌కి సంక్రాంతి పండ‌గే. క్లాస్ హీరోను కూడా మాస్‌గా, ఎమోష‌న‌ల్‌గా చూపించ‌గ‌ల స‌త్తా బోయ‌పాటిది. స‌రైనోడు సినిమాతో ఈ విష‌యాన్ని బోయ‌పాటి ఫ్రూవ్ చేసేసుకున్నాడు. ఇక టాలీవుడ్‌లో ఏ హీరో అయినా మాస్ హీరోగా ఎదిగేందుకు బోయ‌పాటి మంచి ఆప్ష‌న్‌గా మారాడు. ఈ సినిమాతోను ఈ విష‌యాన్ని మ‌రోసారి ఫ్రూవ్ చేశాడు. ఓ ప్రేమ‌క‌థ‌కు యాక్ష‌న్ హంగులు అద్దేసిన బోయ‌పాటి తాను అనుకున్న దానిని స‌మ‌ర్థ‌వంతంగా తెర‌కెక్కించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.

సినిమా స్టార్టింగ్ నుంచి యాక్ష‌న్ మోడ్‌తో ముందుకు సాగిపోతుంటుంది. ప్ర‌తి యాక్ష‌న్ స‌న్నివేశానికి ముందు వ‌చ్చే సీన్ల‌ను ద‌ర్శ‌కుడు బాగా డిజైన్ చేసుకున్నాడు. హీరోయిన్ క్యారెక్ట‌ర్ చుట్టూ ప‌రువు, పంతాల మ‌ధ్య ఆమె ఎలా న‌లిగిపోయింది అన్న అంశాన్ని బేస్ చేసుకుని ద‌ర్శ‌కుడు తీసిన సీన్లు బాగున్నాయి. షాక్ ఏంటంటే ఇది ప్రేమ‌క‌థే అయినా సినిమాలో రొమాన్స్ స‌న్నివేశాల క‌న్నా యాక్ష‌న్ స‌న్నివేశాల మోతే ఎక్కువుగా ఉంటుంది. 

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్స్ వ‌ర్క్‌:
టెక్నిక‌ల్‌గా సినిమాకు అన్ని డిపార్ట్‌మెంట్లు న్యాయం చేశాయి. ప్ర‌తి చిన్న పాత్ర‌లోను గుర్తింపు ఉన్న న‌టులే క‌నిపిస్తారు. భారీ కాస్టింగ్ సినిమాను ఎక్క‌డికో తీసుకెళ్లింది. రిషీ పంజాబీ సినిమాటోగ్ర‌ఫీ నిర్మాత‌లు పెట్టిన ప్ర‌తి పైసాను తెర‌మీద చ‌క్కగా ప్ర‌జెంట్ చేయ‌డంలో ఆవిష్కృత‌మైంది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతంలో పాట‌ల‌తో పాటు కంటెంట్‌కు క‌నెక్ట్ అయ్యేలా ఇచ్చిన ఆర్ ఆర్ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. ర‌న్ టైం క‌థ‌కు స‌రిప‌డా ఉండ‌డం సినిమాకు మంచి ప్ల‌స్ అయ్యింది. ఇక నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి సినిమా కోసం ఎక్క‌డా రాజీప‌డ‌కుండా బోయ‌పాటిని న‌మ్మి పెట్టిన ఖ‌ర్చుకు బోయ‌పాటి న్యాయం చేశాడు. ఈ విష‌యంలో నిర్మాత‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.

బోయ‌పాటి డైరెక్ష‌న్ క‌ట్స్‌:
బోయ‌పాటి శీను డైరెక్ష‌న్ విష‌యానికి వ‌స్తే ఓ ప్రేమ‌క‌థ‌కు యాక్ష‌న్ హంగులు అద్ది ఈ సినిమాను తెర‌కెక్కించాడు. బోయపాటి ప్రధాన బ‌లం యాక్ష‌నే. ఈ సినిమా ప్రేమ‌క‌థ అయినా యాక్ష‌న్ డామినేష‌న్ స్ప‌ష్టంగా క‌నిపించింది. క‌థ‌, క‌థ‌నాల్లో మంచి ట్విస్టులు ఉన్నాయి. బ‌ల‌మైన ఎమోష‌న‌ల్ సీన్లు బాగున్నాయి. ఓవ‌రాల్‌గా మ‌రోసారి ఈ సినిమాతో మాస్ సినిమాల కింగ్‌గా బోయ‌పాటి త‌న‌కు తానే సాటి అనిపించుకున్నాడు. 

ప్ల‌స్ పాయింట్స్‌(+):
– బోయపాటి శ్రీను డైరక్షన్
– బెల్లంకొండ శ్రీను డ్యాన్స్ అండ్ ఫైట్స్
– రకుల్ ప్రీత్ సింగ్ పెర్పామెన్స్‌
– ప్ర‌గ్య జైశ్వాల్‌, కేథ‌రిన్ గ్లామ‌ర్‌
– యాక్ష‌న్ సీన్లు
– భారీ కాస్టింగ్‌
– ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌
– టెక్నిక‌ల్ వాల్యూస్‌
– జ‌గ‌ప‌తిబాబు విల‌నిజం

 

అదిరిపోయే ఫైట్స్, అకట్టుకునే పాటలు, రోమాలు నిక్కబొడిచేలా ఎమోషనల్ సీన్లు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి.

PB Rating : 3.5/5