జ‌య‌ల‌లిత ఘ‌న‌విజ‌యం…ప్ర‌త్య‌ర్థుల‌కు డిపాజిట్లు గ‌ల్లంతు

త‌మిళ‌నాడులోని ఆర్‌కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో జయలలిత 1.6 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుండి ఆమె ప్రత్యర్థుల మీద మెజారిటితో ముందుకు దూసుకు వెళ్లారు. ఆమె స‌మీప ప్ర‌త్య‌ర్థి సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ కు కేవలం 8,875 ఓట్లు వచ్చాయి. జయయలిత గెలుపుతో తమిళనాడులో ఆమె అభిమానులు పార్టీ కార్యకర్తలు పండగ చేసుకున్నారు. ఆర్‌కె న‌గ‌ర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నగరంలోని రాణిమేరీ కాలేజ్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

ఈ ఎన్నిక‌ల్లో జయలలిత, మహేంద్రన్‌లతో పాటు కాంగ్రెస్, బీజేపీతో సహా 26 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ ప‌డ్డారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌వు మంది తెలుగు వారు నివ‌సిస్తున్నారు. వారంద‌రూ కూడా జ‌య‌ల‌లిత‌కే ఓట్లు వేసిన‌ట్టు అమ్మ మెజార్టీ ద్వారా అర్థ‌మైంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌లో ఎవ్వ‌రికి కూడా డిపాజిట్లు కూడా రాలేదు. ఊహించిన‌ట్టుగానే జ‌య‌ల‌లిత ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో పాటు ఆమెకు భారీగా ఓట్లు రావ‌డంతో అన్నా డీఎంకే కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకున్నారు. తనను లక్షకు పైగా భారీ మెజారిటీతో గెలిపించిన ఆర్కేనగర్ వాసులకు, ఏఐఏడీఎంకే పార్టీకి మద్దతు తెలిపిన రాష్ట్రప్రజలకు జయ ధన్యవాదాలు తెలిపారు.