కాంగ్రెస్ కు గుడ్ బై… టీడిపీలో చేరిన నటి జయసుధ

కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గతంలో పనిచేసిన జయసుధ ఇప్పుడు టీడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే సిఎం చంద్రబాబు నాయుడును జయసుధ కలిసింది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జయసుధ టీడీపీలో చేరింది. పార్టీ అధ్యక్షుడు, ఏపి సిఎం చంద్రబాబు సమక్షంలో ఆమె టీడీపీలో చేరారు. అయితే గత కొద్దికాలంగా ఆమె టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే టాక్ కూడా వచ్చింది. టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్విన్స్ చేసేందుకు ట్రై చేసినప్పటికీ… జయసుధ మాత్రం మనసు మార్చుకోలేదు.

2009లో ఆమె ఆంధ్రప్రదేశ్ కు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించింది. అయితే 2014లో మాత్రం ఓడిపోయింది.
ఇక నుంచి తాను టీడీపి పార్టీకి కష్టపడి పనిచేస్తానని ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నారు.