జర్నలిస్ట్ నందగోపాల్ కు లైక్ మైండెడ్ సన్మానం

సీనియర్ జర్నలిస్ట్ నందగోపాల్ రచించిన సినిమాగా సినిమా గ్రంథానికి భారత ప్రభుత్వం జాతీయ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో లైక్ మైండెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఏప్రిల్ 23న హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో దర్శకత్వ దాసరి నారాయణరావు, సూపర్ స్టార్ కృష్ణ, కళావాహిని, గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ ప్రముఖ మహిలా దర్శకురాలు విజయనిర్మల, ప్రగటి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు, నిర్మాతల మండలి అధ్యక్షుడు టి.ప్రసన్నకుమార్, డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ.బి, ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు దర్శకులు శివనాగేశ్వరరావు, డైరెక్టర్ ప్రభు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ రఘు, సీనియర్ జర్నలిస్టులు పసుపులేటి రామారావు, భగీరథ, ప్రముఖ నిర్మాత కె.సి.శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

దాసి మాట్లాడుతూ… నందగోపాల్ నాకు మద్రాస్ నుంచి పరిచయం. సినిమాగా సినిమా పుస్తకానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఆనందంగా ఉంది. 21 సంవత్సరాల తర్వాత తెలుగు పుస్తకానికి జాతీయ స్థాయిలో అవార్డు తీసుకొచ్చారు. అని అన్నారు.