జూన్ లో వస్తున్న ఓటర్

జూన్ లో వస్తున్న ఓటర్

మంచు విష్ణు, సురభి జంటగా నటించిన ‘ఓటర్‌’ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. జి.ఎస్‌.కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్ సుధీర్‌ పూదోట నిర్మించారు. జూన్ లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ”ఓటు విలువ, ఓటర్‌ విలువ గురించి చెప్పే చిత్రమిది. కార్తీక్ చక్కగా తెరకెక్కించారు. చక్కని సందేశంతో పటు వినోదాన్ని పంచె చిత్రమిది .యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి” అని అన్నారు.