జ్యో అచ్యుతానంద రివ్యూ…అన్నదమ్ముల అనుబంధం

ఓ సినిమా విజయవంతం కావాలంటే కావాల్సింది మంచి కథ, మంచి స్క్రీన్ ప్లే. మంచి కామెడీ. ఇవన్నీ కలగలిస్తే తిరుగేముంది. ఇప్పుడు జ్యో అచ్యుతానంద విషయంలోనూ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఫాలో అయ్యింది. మంచి కథ రాసుకున్నాడు. దానికి మంచి స్క్రీన్ ప్లే తీర్చిదిద్దాడు. సరైన ఆర్టిస్టులు అంటే.. కథకు అవసరమైన అచ్యుత్ గా నారా రోహిత్, ఆనంద్ గా నాగశౌర్య జ్యో గా రెజినాను ఎంచుకున్నాడు. ముందుగా వీరిలోకి పాత్రల్ని ఇంజెక్ట్ చేశాడనిపిస్తుంది. లేకుంటే సన్నివేశాలు అంత బాగా పండవు. ప్రతీ సీన్ లోనూ కామెడీ పండేలా.. డైలాగ్స్ రాసుకున్నాడు దర్శకుడు. కామెడీ చేయాల్సిన చోట కామెడీ… బాధ్యతగా సన్నివేశాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఎమోషనల్ గా రాసుకున్నాడు. ఎక్కడా తొందరపాటు లేకుండా సన్నివేశాల్లో క్లారిటీ ఉండేలా రాసుకున్నాడు. ఇది విచిత్రమైన, విభిన్నమైన స్క్రీన్ ప్లే. ఇలాంటి స్క్రీన్ ప్లేతో చాలా రిస్క్. కానీ అవసరాల ఆ రిస్క్ ను సమర్థవంతంగా ఫేస్ చేయగలిగాడు.

ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించే సందర్భాల్లో పుట్టిన కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. నారా రోహిత్ సైతం కామెడీని ఈజీగా చేశాడనిపించింది. ఇన్నాళ్లకు లావుగా ఉన్నా క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోయాడు. నాగశౌర్య డిఫరెంట్ లుక్ తో కనిపించాడు. రెజీనా క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశాడు. అయితే సెకండాఫ్ లో ఆమె క్యారెక్టర్ కు ఇంకాస్త క్లారిటీ ఇవ్వాల్సింది. ఇక ఈ సినిమాకు హీరోలు హీరోయిన్స్ తో పాటు ఇతర ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అవే నాగశౌర్య, నారో రోహిత్ భార్య పాత్రలు. నాగశౌర్య భార్యగా నటించిన రామేశ్వరి, నారా రోహిత్ భార్యగా నటించిన పావని గంగి రెడ్డి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తమ సీన్స్ లో పర్ ఫెక్ట్ గా నటించారు. చాలా సహజంగా ఉన్నాయి వీరి పాత్రలు సైతం. నాని గెస్ట్ రోల్ లో కనిపించాడు. చైతన్య కృష్ణ, సీత, శశాంక్, తనికెళ్ల ఇంపార్టెంట్ క్యారెక్ట్స్ లో నటించారు.

కళ్యాణ రమణ మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ సరిగ్గా కుదిరాయి. ముఖ్యంగా అవసరాల డైలాగ్స్ సినిమాకు హైలైట్. ఎన్ని డైలాగ్స్ అని చెబుతాం. ప్రతీ సీన్ లోనూ పంచ్ డైలాగ్స్ ఫట్ ఫట్ మని పడుతున్నాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ అదిరింది. భారీ ఎమోషనల్ సీన్ ను ఇద్దరు హీరోలు బాగా హ్యాండిల్ చేయగలిగారు. ఎందుకంటే సినిమాకు అదే ఆయువుపట్టు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలుస్తుంది. ఒకరి స్టోరీని మరొకరు చెప్పుకునే స్క్రీన్ ప్లేను బాగా డీల్ చేశాడు దర్శకుడు. ప్రేక్షకులకు కన్ఫూజన్ లేకుండా రాసుకున్నాడు. ఓవరాల్ గా దర్శకుడు అవసరాల అన్ని విభాగాల్లోనూ పట్టుసాధించి మంచి సినిమా అందించాడు.

PB Rating : 3.25/5