షాక్ ఇస్తోన్న" కాట‌మ‌రాయుడు " ఫ‌స్ట్ డే వ‌సూళ్ల టార్గెట్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాట‌మ‌రాయుడు ఉగాది కానుక‌గా ఈ నెల 24న సోలోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్‌, ట్రైలర్‌, సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతున్నాయి. కోలీవుడ్ హిట్ మూవీ వీర‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. గోపాల‌…గోపాల డైరెక్ట‌ర్ డాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం, గ‌తంలో గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో అయిన ప‌వ‌న్‌-శృతి క‌లిసి న‌టించిన సినిమా కావ‌డం సినిమాకు ప్ల‌స్ కానుంది.

ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన సాంగ్స్‌కు సైతం అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌వ‌న్ స‌న్నిహితుడు శ‌ర‌త్‌మరార్ నిర్మించిన ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే రూ.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇక ఓవ‌ర్సీస్ రైట్స్ అయితే ఏకంగా రూ 11.5 కోట్ల‌కు కొన్నారు. ఈ నెల 24న సోలోగా రిలీజ్ అవుతుండ‌డం కూడా కాట‌మ‌రాయుడ‌కు ప్ల‌స్ కానుంది.

తొలి రోజు ఏపీ, తెలంగాణ‌లో దాదాపు అన్ని థియేట‌ర్ల‌లోను కాట‌మ‌రాయుడు రిలీజ్ అవుతోంది. తొలి రోజే కాట‌మ‌రాయుడు రూ.40 కోట్ల వ‌సూళ్ల‌ను టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో ప్లాప్ టాక్ తెచ్చుకున్న స‌ర్దార్ సినిమాతోనే ప‌వ‌న్ ఏకంగా రూ.31 కోట్లు తొలి రోజు కొల్ల‌గొట్టాడు. ఇక ఇప్పుడు కాట‌మ‌రాయుడుకు క‌నీసం యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా రూ.40 కోట్లు ఈజీగా వ‌చ్చేస్తాయని లెక్కలేస్తున్నారు.

సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌స్తే ఫ‌స్ట్ వీకెండ్‌లోనే రూ.50 కోట్లు సులువుగా దాటేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. అదే హిట్ టాక్ వ‌స్తే ప‌వ‌న్ ప్ర‌భంజ‌నాన్ని ఎవ్వ‌రూ అంచ‌నా వేయ‌లేరు.