కబాలి మూవీ ఫస్ట్ షో రివ్యూ రిపోర్ట్

క‌బాలి.. క‌బాలి.. ఇప్పుడెక్క‌డ విన్నా.. ఎవ‌రి నోట విన్నా ఈ సినిమా పేరే. చ‌ర్చ కూడా క‌బాలి గురించే. సాధార‌ణంగా ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా ఈ స్థాయిలో ర‌చ్చ ఉంటుందో ఉండ‌దో తెలియ‌దు గానీ కేవ‌లం ర‌జినీకాంత్ సినిమా కాబ‌ట్టే క‌బాలి గురించి ఇంత‌గా చ‌ర్చ న‌డుస్తోంది. త‌న అప్పియ‌రెన్స్ తోనే క‌బాలిని ఆకాశ‌మంత ఎత్తుకు చేర్చాడు సూప‌ర్ స్టార్. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత ర‌జినీ సినిమా విడుద‌ల కానుండ‌టంతో అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. త‌మిళ‌నాట అయితే ఏకంగా విదేశాల నుంచి అభిమానులు సొంత రాష్ట్రానికి చేరుకుంటున్నారు.. త‌లైవా సినిమా త‌మ సొంత ఊళ్లో చూడాలని. అంత పిచ్చితో ఊగిపోతున్నారు ప్రేక్ష‌కులు.

ఇక క‌బాలి మ‌రికొద్ది గంట‌ల్లో విడుద‌ల కానుంది. మ‌రి క‌బాలి ఎలా ఉండ‌బోతుంది..? అస‌లు ఏంటి క‌థ‌..? ర‌జినీ మెప్పిస్తాడా..? లేక ఉసూరుమ‌నిపిస్తాడా..? అస‌లు క‌బాలి ఫ‌స్ట్ రివ్యూ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి..? అందుతున్న స‌మాచారం ప్ర‌కారం క‌బాలి ర‌జినీ అభిమానుల‌కు పండ‌గే పండ‌గ‌. ఆయ‌న స్టైల్.. మేకోవ‌ర్.. స్లో మోష‌న్ వాకింగ్ షాట్స్.. ఇవ‌న్నీ అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కుల‌కు కూడా పండ‌గే. ఇక క‌థ విష‌యానికొస్తే ఎప్ప‌ట్లాగే పాత క‌థే కానీ కాస్త దానికి త‌న స్టైల్ ఆఫ్ ట‌చ్ ఇచ్చాడు రంజిత్.

కథ మొత్తం మ‌లేసియాలోనే జ‌రుగుతుంది. ర‌జినీ చాలా కాలం పాటు జైల్లో ఉండి బ‌య‌టికి వ‌చ్చిన మాఫియా డాన్ గా న‌టించాడు. ఓవ‌రాల్ గా సినిమా సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు ఓకే అనిపిస్తుంది.. ఫ్యాన్స్ కు మాత్రం క‌న్నుల పండ‌గ అంటున్నారు. క‌బాలిపై ఉన్న అంచ‌నాల‌కు ఈ టాక్ చాలేమో అనిపిస్తుంది.. యావ‌రేజ్ టాక్ తోనే అన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేయ‌డం ఖాయం. క‌బాలిలో మ‌రో విశేషం కూడా ఉంది. ఇందులో ఓ ప్ర‌ముఖ వ్య‌క్తి గెస్ట్ రోల్ లో క‌నిపించాడు. ఆయ‌న్ని చూసి అంతా షాకైపోవాల్సిందే. ఇప్పుడే ఆయ‌న గురించి చెబితే ప్రేక్ష‌కులు థ్రిల్ మిస్ అవుతారు. థియేట‌ర్స్ లో ఆయ‌నెవ‌రో చూసి తెలుసుకోండి.. సో గెట్ రెడీ ఫ‌ర్ క‌బాలి ఫీస్ట్ ఫోక్స్..!