కల్కి మూవీ రివ్యూ…

కల్కి మూవీ రివ్యూ…

తారాగణం : రాజశేఖర్‌, అదా శర్మ, నందితా శ్వేతా, రాహుల్‌ రామకృష్ణ, అశుతోష్ రాణా
సంగీతం : శ్రావణ్‌ భరద్వాజ్‌
దర్శకత్వం : ప్రశాంత్‌ వర్మ
నిర్మాత : సీ కల్యాణ్, శివాని, శివాత్మిక

గరుడవేగతో ఫుల్ జోష్ లో ఉన్నాడు హీరో రాజశేఖర్. అలాగే ఆ అనే ఇంట్రెస్టింగ్ సినిమా తో ఇంప్రెస్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు కల్కి గా మనముందుకు వచ్చారు. ట్రైలర్ తో బాగా ఇంపాక్ట్ క్రీయేట్ చేశారు. భారీ అంచనాలతో ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథేంటంటే…
కల్కి.. కథ అంతా 1980ల కాలంలో సాగుతుంది. రజాకార్ల దాడుల్లో రాజు చనిపోవటంతో కొల్లాపూర్‌ సంస్థానం బాద్యతలు రాణీ రామచంద్రమ్మ తీసుకుంటారు. సంస్థానం మీద కన్నేసిన ఆ ప్రాంత ఎమ్మెల్యే నర్సప్ప (అశుతోష్ రాణా), పెరుమాండ్లు (శత్రు) రాణీని చంపి సంస్థానాన్ని హస్తగతం చేసుకొని ప్రజలను హింసిస్తుంటారు. తరువాత నర్సప్ప, పెరుమాండ్లు మధ్య కూడా గొడవలు రావటంతో ఊరు రణరంగంలా మారుతుంది. ప్రజలు నర్సప్ప అరాచకాల్ని భరించలేక, ఎదురుతిరగలేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంటారు.
. ఈ హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కల్కి(రాజశేఖర్‌)ని ప్రత్యేకంగా అపాయింట్‌ చేస్తారు. కొల్లాపూర్‌ వచ్చిన కల్కి, జర్నలిస్ట్ దేవదత్తా (రాహుల్ రామకృష్ణ) సాయంతో  ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడతాడు. కల్కి ఈ కేసు ఎలా చేదించాడు..? అసలు శేఖర్‌ బాబు ఎలా చనిపోయాడు.? ఎవరు చంపారు..? ఈ కథతో ఆసిమా(నందితా శ్వేత)కు సంబంధం ఏంటి.? అన్నదే మిగతా కథ.

సమీక్ష….

దర్శకుడు ప్రశాంత్ ఈ సినిమా కథ కోసం చాలా కష్టపడ్డారు. స్క్రీన్ ప్లే పరంగా బాగా వర్క్ చేశారు. హీరో రాజశేఖర్ కు పర్ఫెక్ట్ కథగా తయారు చేశారు. తెలుగు లో ఈ తరహా కథనం కొత్తగా ఉంటుంది. ఒక దర్శకుడి ప్రతిభ ఏపాటిదో చెప్పడానికి ఒక్క సినిమా చాలు. రొటీన్‌కు భిన్నంగా క్రియేటివ్ కథలతో సినిమాలు తెరకెక్కించే దర్శకులు తెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువ. అలాంటి దర్శకుడే ప్రశాంత్ వర్మ. ఆయనలోని టాలెంట్‌ను గుర్తించిన హీరో నాని ‘అ!’తో ప్రశాంత్ వర్మకు అవకాశం ఇచ్చారు. తానేంటో ఆ సినిమాతో ప్రశాంత్ నిరూపించుకున్నారు. దీంతో ఆయన తరవాత ప్రాజెక్ట్‌పై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోను పెట్టి ‘కల్కి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో సినిమా తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ ఎంత బాగున్నా దాన్ని తెరపై నడిపించే కథనం సక్రమంగా లేకపోతే ఆ సినిమా దండగే. ట్విస్టులతో కూడుకున్న కథకు పదునైన స్క్రీన్‌ప్లే తోడతైనే ఆ సినిమా ప్రేక్షకుడి నాడికి తగులుతుంది. అలాంటి అద్భుతమైన స్క్రీన్ ప్లే ఇందులో చూడొచ్చు.  దర్శకుడు ప్రశాంత్ వర్మ రాసుకున్న కథ చాలా బలంగా ఉంది. బలమైన పాత్రలు సినిమాను ముందుకు తీసుకెళ్ళాయి.

హీరో పాత్ర తరవాత సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జర్నలిస్టు దత్తు పాత్ర. రాహుల్ రామకృష్ణ ఈ పాత్రలో చాలా నేచురల్‌గా నటించారు. ఆయన భయపడుతున్న ప్రతిసారి ప్రేక్షకుడు నవ్వుతాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో రాజశేఖర్, రాహుల్ రామకృష్ణ కనిపిస్తారు. ఇక రాజశేఖర్ ప్రేయసిగా నటించిన అదాశర్మకు సినిమాలో ఉన్నంతలో మెప్పించింది. నందితాశ్వేత పాత్ర సినిమాకు కీలకమే అయినా ఆమెకు స్క్రీన్ స్పేస్ తక్కువే. విలన్ పాత్రలో అశుతోష్ రాణా ఎప్పటిలానే చాలా బాగా నటించారు. శత్రు, సిద్ధు జొన్నలగడ్డ, పూజిత పొన్నాడ, నాజర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మలో మంచి ఆలోచనలు.. కొత్తగా ఏదో చేయాలన్న ఉత్సాహం కనిపించాయి.. అతను కథను – ఆసక్తికరంగా చెప్పడం జరిగింది. స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ అయ్యింది. కథలో ఉన్న విషయాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయడంలో ప్రశాంత్ సక్సెస్ అయ్యాడు. పాత్రల చిత్రణ.. సన్నివేశాల రూపకల్పనలో దర్శకుడి ప్రతిభ స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాకు మ్యూజిక్ కెమెరా ప్రొడక్షన్ విలువలు చాలా చాలా బాగున్నాయి. నేపధ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోశాయి.

ఓవరాల్ గా …. గరుడ వేగ తర్వాత హీరో రాజశేఖర్ కు అద్భుతమైన హిట్ పడింది. ఫుల్ మాస్ కమర్షియల్ హంగులున్నాయి కాబట్టి అన్ని వర్గాల్ని మెప్పిస్తుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా మంచి కమర్షియల్ సినిమా అందించాడు. సో గో అండ్ వాచ్….

PB Rating : 3.25/5