పీకే రీమేక్‌లో కమల్…అమీర్‌ రోల్‌లో నగ్నంగా యాక్టింగ్

బాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ హీరోగా నటించిన పీకే సినిమా తమిళ్ రీమేక్‌లో కమల్‌హాసన్ నటిస్తున్నారట. అమీర్‌ఖాన్ గ్రహాంతర వాసిగా నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించింది. రూ.650 కోట్లు వరల్డ్‌వైడ్‌గా పీకే వసూలు చేసింది. ఈ సినిమా తమిళ్ రీమేక్ హక్కులను జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటనకు స్కోప్ ఉండడంతో కమల్ తమిళ్ రీమేక్‌లో నటించేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం. హిందీ సినిమాలో అమీర్ నగ్నంగా నటించి సంచలనం సృష్టించాడు. 

అమీర్ దొంగ బాబాల మోసాలను బయటపెట్టి… నగ్నంగా నటించి సినిమాను రక్తి కట్టించాడు. అమీర్ సరసన అనుష్క శర్మ జంటగా నటించిన ఈ సినిమాను విదువినోద్ చోప్రా నిర్మించారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. కమల్ కూడా అమీర్ రోల్‌లో తన నటనతో కోలీవుడ్‌ను ఎలా మైమరిపిస్తారో చూడాలి. పీకే తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కనుంది. కమల్ అప్‌కమింగ్ మూవీ ఉత్తమవిలన్ సినిమా ఆడియో మార్చి 1న సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.