ఫ్యాన్స్‌కు కమల్ న్యూఇయర్ సర్‌ఫ్రైజ్ గిఫ్ట్

విలక్షణ నటుడు కమల్‌హాసన్ తన ఫ్యాన్స్‌కు న్యూఇయర్ కానుకగా సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. విలక్షణ నటుడు కమల్‌హాసన్ నటించిన ఉత్తమవిలన్ ఆడియోను ఏరోస్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా మిక్సింగ్ కార్యక్రమాలు లాస్ ఎంజెల్స్‌లోని పారామౌంట్ స్టూడియోస్‌లో జరుగుతున్నట్టు కమల్ తెలిపారు. ఈ సినిమాపై కమల్ మాట్లాడుతూ న్యూఇయర్ కానుకగా జనవరి 1న ఉత్తమ విలన్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నామన్నారు. ఈ సినిమాలో కమల్ రెండు గెటప్స్‌లో కనిపిస్తున్నారు. మళయాళంలో ప్రముఖ నాట్యం తెయ్యమ్ కళాకారుడిగాను… సినిమా నటుడిగాను కనిపిస్తారు. ప్రముఖ నటుడు రమేష్ అరవింద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాలో దివంగత దర్శకుడు కె.బాలచందర్, పూజకుమార్, ఆండ్రియా, పార్వతి, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్-రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక కమల్ నటించిన మరో సినిమా విశ్వరూపం-2 కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తమిళ దృశ్యం రీమేక్ పాపనాశనం కూడా ఈ సంవత్సరమే విడుదలవుతోంది. ఇక వచ్చే సంవత్సరం కమల్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.