కమీనే ట్రైలర్ విడుదల 

రాము వీరవల్లి, స్వర్ణ ప్రధాన పాత్రదారులుగా ఉదయ్ దర్శకత్వంలో క్రౌడ్ ఫండింగ్ తో రూపొందుతున్న చిత్రం “కమీనే” . చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ ను శుక్రవారం బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్  విడుదల చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ మాట్లాడుతూ..అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఒక రాజకీయ నాయకుడు, డబ్బు కోసం ఎలాంటి  నేరం చేయడానికైనా వెనుకాడని ఓ యువకుడు, ఇది తెలిసి అతన్ని ద్వేషించే ఓ అమ్మాయి, చదువంటే భారంగా.. దానికి దూరంగా పారిపోవాలనుకునే ఓ కుర్రాడు… ఇలా సాగుతున్న  ఈ నలుగురి జీవితాల్లో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన ద్వారా వాళ్ళ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నదే ప్రధాన కథాంశంగా రూపొందిన చిత్రమిది” అని అన్నారు.
నటీనటులు: రాము వీరవల్లి,స్వర్ణ, మాస్టర్ సుమన్, సాయిరాజ్, క్రిష్, ఏ వీ ఆర్ 
కెమెరా : తిర్పాల్ , సురేష్
ఎడిటింగ్ : మహేష్
Vfx : వర్క్ ఫ్లో
సంగీతం : సత్య కశ్యప్
నిర్మాతలు : స్నేహితులు ఇంకా ఆత్మీయులు 
రచన-దర్శకత్వం : ఉదయ్
నిర్మాతలు : స్నేహితులు ఇంకా ఆత్మీయులు 
రచన-దర్శకత్వం : ఉదయ్