కాంచన 3 మూవీ రివ్యూ….

రాఘవ లారెన్స్ ముని సిరీస్ లో భాగంగా రూపొందించిన చిత్రం కాంచన 3. ఈ సిరీస్ లో వస్తున్న సినిమాలన్నీ వరుసగా హిట్ అవుతున్నాయి. అందుకే కాంచన 3 పై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు మరింత పెరిగాయి. లారెన్స్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. మరి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే…
రాఘవ (రాఘవ లారెన్స్) తన ఫ్యామిలీతో మరదళ్లతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇదే సందర్భంలో తన తాత ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఆ వెళ్లే క్రమంలో తమతో పాటుగా ఓ దెయ్యానికి చెందిన ఆత్మను కూడా తీసుకెళ్తారు. ఆ దెయ్యం వీరిని బాగా ఇబ్బంది పెడుతుంది. ఆ ఆత్మను బయటికి పంపేందుకు తెగ ట్రై చేస్తారు. ఈ క్రమంలో ఆ దెయ్యం రాఘవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

కాళీ (లారెన్స్) తన అమ్మ ప్రారంభించిన రాధమ్మ ఆశ్రమం ద్వారా అనాథ పిల్లలకు సేవ చేస్తుంటాడు.ఈ సందర్బంలో మినిస్టర్ తమ్ముుడు ఓ డీల్ చెబుతాడు. కానీ ఆ డీల్ కు కాళీ ఒప్పుకోడు. ఆ ఆ తర్వాత కాళీని ఎటాక్ చేస్తారు. ఇంతకూ ఆ దెయ్యం ఎవరు. కాళీ కి మినిస్టర్ తమ్ముడు చెప్పిన డీల్ ఏంటి. రాఘవ శరీరంలోకి ప్రవేశించిన దెయ్యం ఏం చేసింది. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష
రాఘవ లారెన్స్ గత చిత్రాల మాదిరిగానే… ఫన్ క్రియేట్ చేయగలిగాడు ముఖ్యంగా కోవై సరళ ఫ్యామిలీ రాఘవ లారెన్స్ తో చేసే కామెడీ హిలేరియస్ గా పండింది. దెయ్యాలు రావడం భయపెట్టడం… ఫన్నీగా సాగుతుంటాయి. ముఖ్యంగా ముగ్గురు హీరోయిన్లను భయపెట్టే సీన్స్ కూడా నవ్వు తెప్పిస్తాయి. కోవై సరళ బ్యాచ్ బొమ్మలతో పూజలు చేసే సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి. సెకండాఫ్ లో చాలా వరకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో,,, భావోద్వేగాలతో కూడుకున్న సన్నివేశాలతో ముందుకెళ్తుంది.

హార్రర్ కు కామెడీని మిక్స్ చేసి మరోసారి సక్సెస్ అయ్యాడు రాఘవ లారెన్స్. భయం కంటే కూడా కామెడీనే ఎక్కువగా నమ్ముకున్నాడు. ఆ కామెడీకి జనాలు నవ్వకుండా ఉండలేరు. భయం లాంటి అంశాలతో అల్లుకొని రాసుకున్న సీన్స్ తోనే ప్రధానంగా సినిమా సాగుతుంది. ఈ సినిమా ఇటు ఎంటర్టైన్మెంట్ తో పాటు అటు భయాన్ని, ఎమోషన్ని కూడా బాగానే పండించాడు. లారెన్స్ నటన హైలైట్ గా ఉంటుంది. ఇటు రాఘవగా దెయ్యాలకు భయపడుతూ… హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తూ. మరో వైపు కాళీగాపవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించాడు. ఇందులో అదనంగా డ్యాన్సులు ఇరగదీశాడు. ఈ ఏజ్ లో అద్భుతమైన డ్యాన్స్ తో మెప్పించాడు. హీరోయిన్స్ గ్లామర్ తో స్క్రీన్ ని నింపేశారు. వారికి పెర్ ఫార్మ్ చేసేందుకు కూడా స్కోప్ దొరికింది. శ్రీమాన్ కామెడీతో నవ్వించాడు. ఇక కోవై సరళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దర్శకుడిగా రాఘవ లారెన్స్ హర్రర్ అండ్ కామెడీ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ తో ప్రేక్షకులని నవ్విస్తాడు. అలాగే ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఇంతకు ముందు వచ్చిన కాంచన 1, 2 పార్ట్స్ లో ఫాలో అయిన స్క్రీన్ ప్లేనో ఫాలో అయినట్టు కనిపిస్తుంది. చాలా సీన్స్ గతంలో చూసిన మాదిరిగానే అనిపిస్తాయి. తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఈ హర్రర్ కామెడీకి బాగా కుదిరింది. అలాగే థమన్ ఆర్ ఆర్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా….

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంచన 3 చిత్రం ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ ని బాగా మెప్పిస్తుంది. కామెడీకి జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే హార్రర్ పార్ట్ లో కొంత వరకు అరుపులు ఉంటాయి. ఓవరాల్ గా పూర్తి సంతృప్తి చెందకపోయినా… ఓసారి చూడదగ్గ చిత్రం కాంచన 3.

Rating : 3.25/5