కర్త కర్మ క్రియ మూవీ రివ్యూ

వీకెండ్ లవ్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు నాగు గవర. తన రెండో ప్రయత్నంగా దర్శకత్వం వహించిన చిత్రం కర్త కర్మ క్రియ, వసంత్ సమీర్, సెహెర్ జంటగా నటించారు. కాదంబరి కిరణ్ , రవి వర్మ, చంద్రమహేష్, కాశీ విశ్వనాథ్, రాంప్రసాద్, జయప్రకాష్ తదితరులు కీలక పాత్రలు నటించారు. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మించింది. ఈ రోజే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం.

కథేంటంటే :
సిద్దు (వసంత్ సమీర్ ) ఓ సెల్ షాప్ లో సెల్ మెకానిక్ గా వర్క్ చేస్తుంటాడు. కానీ ఎప్పుడూ ఈజీ మనీ సంపాధించాలనే ఆలోచలనతో గడుపుతుంటాడు. ఈ క్రమంలో బైక్ షో రూమ్ లో జాబ్ చేసే మైత్రి (సెహర్) ని చూసి ప్రేమలో పడతాడు. మైత్రిని ఫాలో అవుతూ ఉన్న సమయంలో.. కొన్ని సంఘటనలు అనంతరం మైత్రి, సిద్దు ఫ్రెండ్స్ అవుతారు. అయితే అప్పటికే మైత్రి అక్క దివ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని.. దివ్య చావుకి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలోనే మైత్రి ఉందని.. మైత్రి ద్వారానే సిద్ధుకు తెలుస్తోంది. ఈ విషయంలో సిద్దు మైత్రికి సహాయం చేస్తుంటాడు.

ఈ క్రమంలోనే దివ్యలాగానే మరో ఇద్దరు చనిపోతారు. దాంతో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చెయ్యటానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రవివర్మ వస్తాడు. రవివర్మ విచారణలో సాగే కొన్ని నాటకీయ పరిణామాల తరువాత అసలు ఏం తేలింది ? దివ్యతో పాటు మిగిలిన ఇద్దరి ఆత్మహత్యలు వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ? ఈ కేసులకు సిద్ధు కి ఏమైనా సంబంధం ఉందా ? ఉంటే ఈ కేసుల్లో సిద్దు ఎలా ఇన్ వాల్వ్ అయి ఉన్నాడు ? చివరకి సిద్దు, మైత్రి కలుస్తారా ? లేదా ? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష
ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ స్క్రీన్ ప్లే. ఓ వైపు లవ్ స్టోరీ రన్ చేస్తూనే… వెనకాల మరో స్టోరీని కూడా రన్ చేశాడు దర్శకుడు. ముఖ్యంగా సెకండాఫ్ లో కథలో వేగం పెంచి స్క్రీన్ ప్లే పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా హీరో పెర్ ఫార్మ్ చేశాడు. లుక్స్ పరంగా బాగున్నాయి. తనదైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. కథను తన భుజాల మీదేసుకున్నాడు. హీరోయిన్ బాగుంది. తన అభినయంతో ఆకట్టుకుంది. హీరో హీరోయిన్ పెయిర్ బాగుంది. క్లైమాక్స్ తో హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఆకట్టుకుటుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో రవి వర్మ నటించాడు. ఈ సినిమా రవికి మంచి పేరు తీసుకొస్తుంది. సెకండాఫ్ లో ఎక్కువగా రవి మీదే సినిమా రన్ అవుతుంది. జబర్దస్త్ రాంప్రసాద్ తన కామెడీతో నవ్వించాడు. హీరోకు బెస్ట్ ఫ్రెండ్ గా నటించాడు. కాదంబరి కిరణ్ కి మంచి క్యారెక్టర్ దక్కింది. దివ్య పాత్ర కూడా బాగుంది. పాత్రకు తగ్గట్టుగా చేసింది.

సెల్ ఫోన్, రహస్య సంబంధాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చక్కగా చెప్పాడు. సెల్ ఫోన్ లో ఉండే సమాచారం బయటికి వస్తే పరిస్థితి ఏంటనేది దర్శకుడు నాగు బాగా రాసుకున్నాడు. డైరెక్ట్ గా కథను చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ చెప్పాడు. సెకండాఫ్ లో ఇంటెన్సిటీ పెంచాడు. కథలో బలం ఉండడంతో స్క్రీన్ ప్లేను బాగా రాసుకున్నారు. ఫస్టాఫ్ సరదాగా వెళ్తూనే చిన్న సస్పెన్స్ ను మెయింటైన్ చేయగలిగాడు. లాజికల్ గా కూడా బాగా కేర్ తీసుకున్నాడు. సెకండాఫ్ లో పోలీసాఫీసర్ ఇన్వెస్టేగేషన్ ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. ఆత్మహత్యలకు కారణాల్ని వెతికే క్రమంలో బయటికి వచ్చే నిజాలు ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నప్పటికీ చాలా వరకు తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకుల్ని ఏంటర్ టైన్ చేయగలిగాడు. సస్పెన్స్ మెయింట్ చేయగలిగాడు. సెకండాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ తోనూ ఆకట్టుకున్నాడు. సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్ అందించిన పాటలు సినిమాకి తగ్గట్లుగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం ఓకే. సెకండాఫ్ లో బిల్డప్ మ్యూజిక్, సస్పెన్స్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. దుర్గాకిషోర్ బోయిదాపు కెమెరా వర్క్ బాగుంది. స్టేడియంలో హీరో హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకునే ఇంటర్వెల్ సీన్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడి కథకు న్యాయం చేశాడు. నిర్మాతలు ఇంకాస్త ఖర్చు పెట్టి ఉంటే మరింత క్వాలిటీగా సినిమా కనిపించేది.

ఫైనల్ గా నాగు గవర మొదటి చిత్రాన్ని లవ్ స్టోరీతోతెరకెక్కించి రెండో సినిమాను కాంటెంపరరీ స్టోరీని ఎంచుకున్నాడు. నేటి యువతరంమే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన సినిమా ఇది. సెల్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఎవరు ఇబ్బందుల్లో పడ్డా దానికి వారే కర్త, కర్మ, క్రియ అని చెప్పాడు. సో గో అండ్ వాచ్.

Rating : 3.25/5