క‌థానాయకుడు క‌మ‌ర్షియ‌ల్ ఫ్లాప్..

కొన్ని నిజాలు నమ్మడానికి చాలా కష్టంగా ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణ అభిమానులకు కూడా ఇదే జరుగుతుంది. ఈయన నటించిన కథానాయకుడు సినిమా సంక్రాంతికి విడుదల అయింది. ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని వాళ్లు కూడా బలంగానే నమ్మారు. కానీ ఎందుకో తెలియదు మరి తొలిరోజు నుంచే కథానాయకుడు కలెక్షన్ల వేటలో బాగా వెనుకబడింది. ఈ సినిమా ఇప్పుడు కూడా పుంజుకునేలా కనిపించలేదు.

ఫస్ట్ వీకెండ్ కు…15 కోట్ల షేర్, 28 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఇది చూస్తుంటే బయ్యర్లకు నిద్ర రావడం లేదు. ఎందుకంటే వారు ఈ సినిమాపై కోట్లకు కోట్లు పోశారు. ఒకటి రెండు కాదు ఏకంగా 72 కోట్లకు ఈ సినిమాను అమ్మేశాడు బాలకృష్ణ. ఎన్టీఆర్ బయోపిక్ అని ఒక నమ్మకం చూపించి భారీ రేట్లకు సినిమాను అమ్మేశాడు. దాంతో ఇప్పుడు ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు వణికిపోతున్నారు. ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే వచ్చాయి.. ఇంకా 80 శాతం రావాలి.

మ‌రోవైపు సంక్రాంతి సెలవులు కూడా ముగిసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ కథానాయకుడు ఏదో అద్భుతం చేస్తాడని ఊహించడం మాత్రం అత్యాశే. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే కథానాయకుడు కమర్షియల్గా భారీ ఫ్లాప్ కావడం కళ్లముందు కనిపిస్తుంది. మరి దీన్ని బాలయ్య ఎంతవరకు ఒప్పుకుంటాడో చూడాలి. ఈ ప్రభావం మ‌హానాయ‌కుడుపై ఎంతవరకు పడుతుందో అనే చర్చ జరుగుతోంది.