కేసీఆర్ కేబినెట్‌లో కొత్త మంత్రుల శాఖలు.. తుమ్మలకు ప్రాధాన్యం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేబినెట్‌లో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ఆయన శాఖలు కేటాయించినట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన తుమ్మల నాగేశ్వరరావుకు ప్రాధాన్యం ఉన్న రోడ్లుభవనాల శాఖ దక్కిందని తెలుస్తోంది. ఆయన గతంలో కూడా తేదేపా ప్రభుత్వంలో సమైక్య రాష్ట్రానికి ఇదే శాఖా మంత్రిగా పనిచేశారు. మంత్రులు – శాఖల వివరాలు అందిన సమాచారం మేరకు ఇలా ఉన్నాయి

1.తుమ్మల నాగేశ్వరరావు – రోడ్లు, భవనాల శాఖ
2.జూపల్లి కృష్ణారావు – పరిశ్రమలు
3.సి.లక్ష్మారెడ్డి – విద్యుత్ శాఖ
4.తలసాని శ్రీనివాస్ యాదవ్ – పర్యాటక శాఖ
5.ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి – గృహనిర్మాణ శాఖ
6.అజ్మీరా చందూలాల్ – సంక్షేమ శాఖ