టాలీవుడ్ పై కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు…త్వరలోనే కీలక భేటీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి వైజాగ్ తరలి వెళ్తుందనే ఊహాగానాలకు టీ ముఖ్యమంత్రి కెసిఆర్ తెరదించారు. అమితాబ్ కు అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా అన్నపూర్ణ స్టూడియోస్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు చిత్ర పరిశ్రమ భవిష్యత్తును బంగారుమయం చేస్తాం. త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో తాను స్వయంగా భేటీ అవుతాను. ఇండస్ట్రీ సమస్యలపై దృష్టి పెడతాం. హైదరాబాద్ లో షూటింగులు చేసుకునేందుకు అనువైన ప్రాంతంగా మరింత అందంగా తీర్చిదిద్దుతాం. అందరు భావిస్తున్నట్టుగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడికీ తరలిపోదు. ఇక్కడే ఉంటుంది. ఇండస్ట్రీ అభివృద్ధికోసం మరింత కృషి చేస్తాం. టాలీవుడ్ కు దగ్గరగా ఉండే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సినిమాటోగ్రఫీ మంత్రి పదవి ఇచ్చాను. ఈ విషయాన్ని గమనించాల్సింగా కోరుతున్నా. నాగేశ్వరరావు చెన్నై నుంచి ఇక్కడికి ఇండస్ట్రీని తీసుకొచ్చేందుకు ఎంతగా కష్టపడ్డాలో మనకు తెలుసు. అమితాబ్ బచ్చన్ అభిమాన్ అనే సినిమాను 50 సార్లు చూశానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు…నాకు ఆయనంటే ఎంత ఇష్టమో. మా నాగార్జున, మా వెంకట్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అని అన్నారు.

కెసిఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమకు బలాన్నిచ్చినట్టే. చాలా కాలంగా వస్తున్న ఊహాగానాలకు ఆయన చేసిన కామెంట్స్ తో తెరపడ్డట్టే. తెలుగు చిత్ర పరిశ్రమ తరలిపోదనే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడంతో… పను అనుమానాలకు సమాధానం దొరికినట్టయ్యింది.