దేవేంద్ర కు కేసీఆర్ ఫోన్ : పుష్క‌రాల‌కు నీళ్లివ్వండి

తీవ్ర వ‌ర్షాభావం కారణంగా తెలంగాణ పుష్క‌ర ఘాట్ల‌లో ప్ర‌త్యేక ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ముఖ్యంగా.. ఎగువ‌న కూడా పెద్ద‌గా వ‌ర్షాలు ప‌డ‌క‌పోవ‌డంతో తెలంగాణ ప్రాజెక్టులేవీ జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకోలేదు. మ‌రోవైపు పుష్క‌రాలు త‌రుముకొస్తున్నాయి. సాక్షాత్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుష్క‌ర స్నానం చేసే ధ‌ర్మ‌పురి (క‌రీంన‌గ‌ర్ జిల్లా)లోనే గుక్కెడు గోదారి నీళ్లు లేవు. దీంతో ఎగువ రాష్ట్ర‌మైన మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌కు కేసీఆర్ ఫోన్ చేసి, త‌మకు కాస్తో..కూస్తో నీళ్లొద‌లాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విష‌య‌మై దేవేంద్ర స‌ర్కార్ శ‌నివారం సాయంత్రం ఓ నిర్ణ‌యం తీసుకోనుంది.