`ఖాకి`కి అన్నీహిట్ క‌ళ‌లే!

పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌చిన‌ట్టు..హిట్ సినిమాల‌కు సంబంధించిన సంకేతాలు ట్రైలర్ల‌లోనూ, ఆడియోలోనూ క‌నిపించేస్తుంటాయి.ఇప్పుడు అలాంటి హిట్ సూచ‌న‌ల‌తో ప్రేక్ష‌కుల్లో పాజిటివ్ బ‌జ్ రేపుతోంది `ఖాకి` చిత్రం. సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కార్తీ న‌టించిన సినిమా ఇది. ఇందులో ఆయ‌న స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్‌సింగ్ నాయిక‌గా న‌టించారు. హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రెండు ద‌శాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఈ నెల విడుద‌ల కానున్న ఈ సినిమాకు సంబంధించి సినిమా, ప్రేక్ష‌కుల మ‌ధ్య పాజిటివ్ టాక్స్ న‌డుస్తున్నాయి. వాటికి ప్ర‌ధాన కార‌ణం ఈ చిత్రం వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌తో రూపొందడం. వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌తో తెర‌కెక్కిన తెలుగు చిత్రాలు `అంతఃపురం`, `ర‌క్త‌చ‌రిత్ర‌`, `అర్జున్‌రెడ్డి`కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా రూపొందిన `ఖాకి` కూడా అదే పంథాలో సాగుతుంద‌నే న‌మ్మ‌కం నానాటికీ పెరుగుతోంది. 1995 నుంచి 2005 వ‌ర‌కు సాగిన కొన్ని వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని హెచ్‌. వినోద్ ఈ సినిమాను రూపొందించారు. హెచ్‌.వినోద్ ఇప్ప‌టిదాకా తెలుగులో నేరుగా సినిమాలు తీయ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఆయ‌న రూపొందించిన `చ‌తురంగ వేట్టై`గురించి తెలుగు సినీ ప్రియుల స‌ర్కిల్‌లో చాలానే డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి.అంద‌రూ ఆ సినిమా గురించి ఎంత‌గానో మాట్లాడుకున్నారు. అలాంటి ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన చిత్రం కావ‌డంతో నేచుర‌ల్‌గానే `ఖాకి` మీద ఆస‌క్తి రెట్టింప‌యింది. రాజస్థాన్‌లో తెర‌కెక్కించిన దృశ్యాలు, దుమ్మురేపిన యాక్ష‌న్ సీక్వెన్స్ తో ఇప్ప‌టికే భారీ అంచ‌నాల‌ను రేకెత్తిస్తోంది `ఖాకి`. Link for Khakee Trailer: Trailer: https://www.youtube.com/watch?v=BcxdSTdXQpQ