సిల్లీ ఫెలోస్ తో హ్యాట్రిక్ సాధిస్తాం – నిర్మాతలు కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి

అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ‌, నందినిరాయ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం సిల్లీ ఫెలోస్. భీమినేని శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని ఆద్యంతం అల‌రించే విధంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రంతోనే సునీల్ కమెడియ‌న్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టించారు సునీల్. శ్రీ‌వ‌సంత్ సిల్లీఫెలోస్ సినిమాకు సంగీతం అందించ‌గా.. అనీష్ త‌రుణ్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ హ్యాండిల్ చేసాడు. బ్లూ ప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్ ఎల్ఎల్ పి.. మ‌రియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్స్ పై కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మించారు. టిజి విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. ఈనెల 7 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు కిరణ్ రెడ్డి, భరత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు… వారు మాట్లాడుతూ…..

* ‘‘ప్రేక్షకుల్ని నవ్వించడానికే ఈ సినిమా తీశాం. పేరుకు తగ్గట్టు ‘సిల్లీ ఫెలోస్‌’ అడుగడుగునా వినోదం పంచిపెడతారు. నరేష్‌, సునీల్‌ ఇద్దరూ కామెడీ కథానాయకులుగా పేరొందిన వారే. ఇది రీమేక్‌ సినిమా. కానీ తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించాం. నరేష్‌, సునీల్‌ మిత్రులుగా కనిపిస్తారు.
వాళ్లిదరి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ కొత్తగా ఉంటాయి. ఇలాంటి సినిమాల్లో నాలుగైదు పాటలుంటే కథాగమనానికీ, నవ్వులకు అడ్డుపడతాయి. అందుకనే కేవలం రెండు పాటలకే చోటిచ్చాం. ఓ ప్రమోషన్‌ సాంగ్‌ను చేశాం. ఒక్క మాటలో ఇది లాజిక్‌ లేని మ్యాజిక్‌ సినిమా’’.
* ‘‘రీమేక్‌ చిత్రాల్ని రూపొందించడంలో దర్శకుడు భీమనేనిది అందెవేసిన చేయి. అది ఈ సినిమాతో మరోసారి రుజువవుతుంది. ‘‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఎంఎల్‌ఏ’ల తరవాత మా సంస్థ నుంచి వస్తున్న మూడో చిత్రం. తప్పకుండా హ్యాట్రిక్‌ సాధిస్తాం. మా తదుపరి చిత్రాలూ కథాబలంతో సాగేవే. వాటి వివరాలు కూడా త్వరలో ప్రకటిస్తాం’’.