కొత్తగా మా ప్రయాణం మూవీ రివ్యూ

కొత్త దర్శకుడు కొత్త హీరో, కొత్త నిర్మాత సినిమాతో బజ్ క్రియేట్ చేయాలంటే మాత్రం కొత్తగా ఆలోచించాల్సిందే. అందుకే కొత్తగా ప్రయాణం పేరుతో ఓ సినిమా చేశారు. ప్రియాంత్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ.. నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కింది. యామిని భాస్క‌ర్ క‌థానాయిక‌. `ఈ వ‌ర్షం సాక్షిగా` ఫేం ర‌మ‌ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఓ హాట్ సాంగ్ తో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎలా మెప్పించిందో చూద్దాం.

కథేంటంటే…
సూటిగా ఉంటే వ‌చ్చే చిక్కుల గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలా ఉండే కుర్రాడు ఓ అమ్మాయి విష‌యంలోనూ సూటిగా ఉంటే ఆ త‌ర్వాత ఎదురైన ప‌రిణామాలేంటి? అన్నదే మా సినిమా.. స్నేహానికి స‌హ‌జీవ‌నానికి మ‌ధ్య ఉండే ఓ స‌న్న‌ని లైన్ ఏంటో ఇందులో చూపించారు. కార్తీక్ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అతనికి యామిని పరిచయమౌతుంది. తాను కూడా అదే కంపెనీలో పనచేస్తుంటుంది. అయితే ఇద్దరికీ పెళ్లి మీద సదభిప్రాయం లేదు. అందుకే ఇద్దరూ సహజీవనం చేసేందుకు కలిసి ఉంటారు. ఇద్దరూ సెక్సువల్ గా కూడా ఒక్కటవుతారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య తేడాలొస్తాయి. కార్తీక్ మీద కేసు కూడాపెడుతుంది. ఇంతకూ ఇద్దరి మధ్య వచ్చిన గొడవలేంటి వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నారనేది అసలు కథ.

సమీక్ష
ఫ‌న్, ల‌వ్, యాక్ష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో ఈ సినిమా ఉంటుంది. ట్రెండీ స్టోరీని చూపించాడు. ఈ జనరేషన్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సినిమా ప్రారంభం నుంచి స్పీడ్ గా వెళ్తుంది కథ. హీరో ప్రియాంత్ మంచి జోష్ తో యాక్టింగ్ చేశారు. డైలాగ్స్ తో పాటు బాడీ లాంగ్వేజ్ బాగుంది. హీరోకు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. యాక్షన్ పార్ట్ లోనూ ఇరగదీశాడు. అక్కడక్కడ ఎమోషన్ సీన్స్ లోనూ మెప్పించాడు. హీరోయిన్ యామినీ భాస్కర్ యాక్టింగ్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోయింది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ హాట్ హాట్ గా ఉంది. భాను, గిరి, ఈరోజుల్లో సాయి, జీవా, కారుణ్య త‌దిత‌రులు తమకిచ్చిన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. .

ప్రియాంత్ కార్తీక్ అనే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్ర‌లో మెప్పించాడు. హార్డ్‌ కోర్ మెంటాలిటీ.. ముక్కుసూటి గా ఉండే కుర్రాడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. . త‌న‌కు ఏదైనా కావాలి అనుకుంటే కావాలి అంతే. న‌లుగురికి సాయ‌ప‌డ‌ే పాత్రలో నటించాడు. ఒక అమ్మాయితో సూటిగా మాట్లాడాక క‌థ ఏ మలుపు తిరిగిందనే విషయాన్ని దర్శకుడు బాగా చూపించాడు. ఇప్పుడు ఉన్న సాఫ్ట్ వేర్ క‌ల్చ‌ర్ లో ఎవ‌రెలా ఉంటున్నారో చక్కగా చూపించారు. లివిన్ రిలేషన్ షిప్ గురించి ప్రాబ్లమ్స్ గురించి చర్చించాడు. రొమాన్స్ విషయంలో తగ్గలేదు. హీరో హీరోయిన్ మధ్య మంచి రొమాన్స్ చూపించాడు. వల్గర్ గాలేకుండా నీటిగా ఉంటుంది.

మ్యూజిక్, కెమెరా వర్క్ చాలా బాగుంది. నిర్మాణ విలువ‌లు ఆక‌ట్టుకుంటాయి. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. యూత్ ఫుల్ గా ఉన్నాయి. క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్ బాగుంది. మంచిమెసేజ్ ఇచ్చారు. స్వేచ్ఛా జీవ‌నానికి అల‌వాటు ప‌డితే ఎలా ఉంటుందో చెప్పాడు. హాస్ట‌ల్స్ లో ఉండే కుర్రాళ్ల లైఫ్ ఎలా ఉందో చూపించారు. అయితే స్వేచ్ఛ ఇచ్చినా బాధ్య‌త‌గా ఉండాల‌నే సందేశం ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దారు.

చివరిగా
ఈ సినిమా అన్ని సినిమాల్లా.. రొటీన్ గా ఉండ‌దు. యువ‌త‌రం ఎలా ఉన్నారో చెప్పాడు. చ‌క్క‌ని ఫీల్ తో సినిమా సాగుతుంది. ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేయొచ్చు. సో గో అండ్ ఎంజాయ్.

PB Rating : 3/5