కొవిడ్ మాస్క్ ల తయారీలో నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్

కొవిడ్ మాస్క్ ల తయారీలో
నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్

పలు చిత్రాలకు పరోక్ష సహాయ సహకారాలు అందించి.. మోహన్ లాల్-అమలాపాల్ నటించిన ‘బ్లాక్ మనీ’తో నేరుగా నిర్మాణంలోకి దిగి- స్ట్రెయిట్ గా ‘మై డియర్ మార్తాండం’
చిత్రాన్ని నిర్మించిన- నెల్లూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త-రాజకీయ నాయకులు సయ్యద్ నిజముద్దీన్.. కరోనాను కట్టడి చేసే క్వాలిటీ మాస్క్ ల తయారీ చేపట్టారు. మెడికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా కలిగిన నిజాముద్దీన్… అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మాస్క్ లు రూపొందిస్తున్నారు. నెల్లూరు కేంద్రంగా ‘అను మాస్క్’ పేరుతో ఉత్పత్తి అవుతున్న ఈ మాస్క్ లు.. దేశవ్యాప్తంగా మార్కెట్ లో లభ్యం కానున్నాయి.
ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని వైద్య నిపుణులు తేల్చి చెబుతుండడంతో… మాస్క్ లు మన జీవితంలో ఒక ముఖ్య భాగం కానున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని.. అందరికీ అందుబాటు ధరలో.. ఆత్యంత నాణ్యత కలిగిన మాస్క్ లు అందిస్తున్నామని నిజముద్దీన్ అన్నారు. పూర్తిగా లాభాపేక్షతో కాకుండా.. ఎంతో బాధ్యతాయుతంగా ‘అను మాస్క్’ ల తయారీ నిర్వహిస్తున్నామని తెలిపారు!!