50 ఏళ్లుగా ఆదరించారు…థాంక్స్…శ్రీమంతుడు సూపర్ హిట్ ఖాయం – కృష్ణ

మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తన స్పందనను తెలియజేశారు…. ఆయన మాట్లాడుతూ…

శ్రీమంతుడు టైటిల్ చాలా బాగుంది. టీజర్ చూశాను. అద్భుతంగా ఉంది. మహేష్ బాబు చాలా గ్లామరస్ గా ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మా సత్యమూర్తి గారి అబ్బాయి. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అందరి ఆశీర్వచనాలతో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. 50 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. అదే విధంగా మహేష్ బాబు ను కూడా ఆదరిస్తున్నారు. చాలా కృతజ్ఞతలు.