అల్లు అర్జున్ సరసన 1 హీరోయిన్ కృతి సనన్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి సూపర్ హిట్టయ్యింది. మళ్లీ అదే కాంబినేషన్లో మరో సినిమా ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీకోసం మంచి హీరోయిన్ ను సెలెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఫిలింనగర్ సర్కిల్స్ లో మాత్రం మహేష్ బాబు 1 సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతిసనన్ ను పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే కృతీ సనన్ చాలా పొడవుగా ఉంటుంది. అల్లు అర్జున్ పక్కన బాగుంటుందా అనే ఆలోచనలో పడ్డారట. ఒకవేళ ఆమెనే హీరోయిన్  గా పెట్టుకోవాలనుకుంటే టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా కథలో చిన్న మార్పులు చేసి ఆమె హైట్ గురించి ఏదో డైలాగ్ రాసేస్తాడులే అనే టాక్ వినిపిస్తోంది. 

1 సినిమా ఫలితం ఎలా ఉన్నా కృతీకి మంచి పేరొచ్చింది. అయితే ఇప్పటిదాకా ఈ టాల్ మరే తెలుగు సినిమా కూడా కమిట్ కాలేదు. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ అమ్మడు బిజీగా ఉంది.