క్షణ క్షణం మూవీ రివ్యూ

డేటింగ్ కాన్సెప్ట్ మీద ఇటీవల చాలా సినిమాలు యూత్ ని బేస్ చేసుకొని తెరకెకెక్కాయి. డబ్బులు సంపాదించాలంటే ఓ పెళ్ళైన ఆంటీనో… లేక సంపన్నుల కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ఆకర్షించి సొమ్ము చేసుకోవడం చూసుంటాం. అయితే ఈ డేటింగ్ వెబ్ సైట్స్ లో అమ్మాయిలు కూడా అబ్బాయిల కోసం తపించడం.. వాళ్ళతో కొంత క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకోవడం… దానివల్ల చాలా అనర్థాలకు దారి తీయడం ఇటీవల చాలానే రియల్ ఇన్సిడెంట్స్ చూసుంటాం. అలాంటి బేస్ చేసుకొని తెరకెక్కిన సినిమా “క్షణ క్షణం”.మరి ఈ చిత్రం యూత్ లో ఏమాత్రం క్రేజ్ ని సంపాదించుకుందో చూద్దాం పదండి

కథ: వైజాగ్ బేస్డ్ గా జరిగే ఈ సినిమాలో హీరో సత్య(ఉదయ్ శంకర్) ఓ అనాథ. అతను మరో అనాథ అయిన ప్రీతి(అర్జున్ రెడ్డి ఫేమ్ జియా శర్మ)ని పెళ్లి చెలుకొని అందమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ వుంటారు. అయితే ప్రీతికి కొంచం డబ్బు పిచ్చి. దాంతో చేపల బిజినెస్ లో బాగా నష్టపోయిన తన భర్త నుంచి విడిపోవాలని విడాకులు కోరుతుంది. ఈ సమయంలో ఓ డేటింగ్ వెబ్ సైట్ ద్వారా పరిచయం అయిన వివాహిత మాయ(శ్రుతి సింగ్)తో ఓ రాత్రి గడపడానికి నిర్ణయించుకుంటారు. అయితే సత్య.. మాయ.. ఇంటికి పోయే సమయానికి ఆమె మరణించి ఉంటుంది. ఇది చూసిన సత్య వెంటనే పోలీసులకు ఇన్ఫర్మ్ చేస్తాడు. అయితే పోలీసులు మాత్రం సమాచారం ఇచ్చిన సత్యానే అనుమానించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. మరి ఈ కేసులో నుంచి సత్య ఎలా బయట పడ్డాడు? ఇంతకూ ఈ హత్యను చేసింది ఎవరు? సత్య… తన భార్య తో విడాకులు తీసుకున్నాడా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!!!

కథ.. కథనం విశ్లేషణ: డేటింగ్ ఆన్లైన్ వెబ్సైట్ మీద ఓ కాంటెంపరరీ ఇష్యుస్ ని బేస్ చేసుకొని రాసుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. ముఖ్యంగా యూత్ ని బేస్ చేసుకొని తెరకెక్కించిన సీన్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీకి పని చేసిన వారంతా కొత్త వారే అయినా.. ఆడియన్స్ ని “క్షణ క్షణం”థ్రిల్లింగ్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.
హీరో ఉదయ్ శంకర్ క్యారెక్టర్ చాలా డీసెంట్ గా… మెచ్యూర్ గా ఉంది. ముఖ్యంగా శ్రుతి సింగ్ హఠాత్తుగా మరణించిన సంఘటన సీన్ లో… ఉదయ్ శంకర్ నటన చాలా పరిణితి గా కనిపించింది. పోలీసు పాత్రలో నటుడు రవిప్రకాష్ బాగా నటించారు. ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ గా మెప్పించాడు. ఫీమేల్ లీడ్ పోషించిన “అర్జున్ రెడ్డి” ఫేమ్ జియా శర్మ.. డబ్బు మీద వ్యామోహం ఎక్కువగా వున్న భార్య పాత్రలో మెప్పించింది. శ్రుతి సింగ్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. కోటి, రఘు కుంచె తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు కార్తీక్ మేడికొండ రాసుకున్న ఇంట్రెస్టింగ్ కథ.. కథనం బాగుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో జరుగుతున్న వింత పోకడలు… దాని పర్యవసానం బాగా చూపించారు. కోటి తనయుడు రోషన్ సాలూర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. సిద్ధార్థ్ కారుమురి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త కృస్పీ గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు డాక్టర్ వర్లు, డాక్టర్ మన్నం చంద్ర మౌళి ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా… సినిమా ను తెరకెక్కించినారు. చివరగా… ఇది ఒక మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్.. గో అండ్ వాచ్..!!!

రేటింగ్: 3.25/5