ముఖేష్ అంబానీ, సైరస్ మీస్ర్తీని కలిసిన మంత్రి కె.తారక రామారావు

ముంబైలో టాటా గ్రూప్ ఛైర్మెన్ సైరస్ మిస్త్రీని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంభానీని కలిసిన ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు

తెలంగాణలో ఉన్న పెట్టుబడి, అవకాశాలను, వివిధ రంగాల్లోని అవకాశాలను, తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం మెరిట్స్ ని వివరించిన మంత్రి

డబుల్ బెడ్రూంలో టాటాల భాగసామ్యం, టాటా ఏఐజి సెంటర్ ఏర్పాటుకి అంగీకారం

ముఖేష్ అంబానీతోనూ బేటీ అయిన మంత్రి

తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడులును తీసుకోచ్చేందుకు ఐటి మరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామావు ఓక రోజు పర్యటన నిమిత్తం ముంబాయిలో పర్యటించారు. ముంబైలో టాటా గ్రూప్ ఛైర్మెన్ సైరస్ మిస్త్రీని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంభానీని కలిసిన ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి, అవకాశాలను, వివిధ రంగాల్లోని అవకాశాలను, తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం మెరిట్స్ ని ముఖేష్ అంబానికి, సైరస్ మీస్ర్తీకి వివరించారు. టాటా గ్రూప్ ఇప్పటికే నగరంలో పెట్టుబడులున్న డిఫెన్స్ మరియు ఏరో స్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు టాటా గ్రూపు ఆసక్తి చూపిందని మంత్రి తెలిపారు. తెలంగాణకి టాటాలు బ్రాండ్ అంబాసిండర్స్ అన్న ముఖ్యమంత్రి మాటలను మంత్రి మిస్ర్తీతో చర్చల సందర్భంగా తెలిపారు. మీస్ర్తీతో ఐటి పరిశ్రమ, పారిశ్రామిక రంగంతో పాటు హౌసింగ్ రంగంలో పెట్టుబడులపైన చర్చించినట్లు మంత్రి తెలిపారు. మంత్రి సూచనలకి సానుకూలంగా స్పందించిన మీస్ర్తీ తెలంగాణకి పలు హమీలు ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకంలో భాగస్వామ్యానికి టాటా గ్రూపు అంగీకారం తెలిపింది. టాటా హౌసింగ్ ప్రాజెక్టుల తరపున ఈ కార్యక్రమంలో భాగసామ్యం తీసుకుంటామని సైరస్ మీస్ర్తీ మంత్రిక హమీ ఇచ్చారు. హైదరాబాద్ లో TATA – AIG టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు మీస్ర్తీ తెలిపారు. ఇక టాటా క్యాపిటల్ తో టీ హబ్ ఇన్నోవేషన్ ఫండ్ కి సహకారం అందించేందుకు సైతం టాటా గ్రూప్ నిర్ణయించింది.
సాయంత్రం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతోనూ మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణలో పరిశ్రమల అభివృద్దికి అనేక అవకాశాలున్నాయని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, డబుల్ బెడ్ రూం ఇళ్లు, విద్యుత్ ప్రణాళికలను మంత్రి అంబానీకి వివరించారు. ప్రతి పథకానికి ఓక డెడ్ లైన్ తో ముందుకు వెలుతున్నామని, వాటర్ గ్రిడ్ పూర్తి కాకుంటే ఏన్నికలకి వెళ్లమని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఓక పక్కా విజన్ తో ముందుకు పోతున్నదని, దానిక తగ్గ అచరణసైత్ కనిపిస్తున్నదని అంబానీ అన్నారు. అయన (Vision without execution is an illusion) అని అంబానీ మంత్రికి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు, ప్రణాళికలను, అచరణని అంబానీ మెచ్చుకున్నరు. ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ వద్ద ప్రణాళికలున్నాయని, త్వరలోనే ప్రభుత్వంతో పెద్ద ఏత్తున వివిధ రంగాలో పనిచేస్తామని మంత్రికి తెలిపారు.
ఈ ముంబాయి పర్యటలో మంత్రి వెంట ఐటిశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు.