తెలంగాణ సాగునీటి పథకంపై కె.తారక రామారావు పవర్ పాయింట్ ప్రజేంటేషన్

తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు మరోసారి దేశంలోని వివిధ రాష్ట్ర్లాల మంత్రుల దృష్టిని ఆకర్షించారు. ఈ రోజు డీల్లీలో జరిగిన గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రుల సమావేశంలో పాల్గోన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పనులను మంత్రి ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. దేశంలో గ్రామీణ త్రాగునీరు మరియు పారిశద్యం నిర్వహణపైన ఈ సమావేశం లో సమీక్షనిర్వహించింది. కేంద్ర గ్రామీణాబివృద్ది శాఖమంత్రి చౌదరీబిరేంద్రసింగ్ ఈ సమావేశానకి అధ్యక్షత వహించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరదను చేపట్టినట్లు మంత్రి తన పవర్ పాయింట్ ప్రజేంటేషణ్ లో పెర్కోన్నారు. 2019 నాటికి ఈప్రాజెక్టుపూర్తి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన, టెండర్లు, ప్రాజెక్టు అమలులో ప్రభుత్వం చేపట్టిన వినూత్న పద్దతులను మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన ఈ ప్రాజెక్టు పూర్తి కాకుంటే వచ్చే ఏన్నికల్లో ఓట్లుఅడగమన్న మాటను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ ప్రాజెక్టుతో పాటు ప్రభుత్వం ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చే పైబర్ గ్రిడ్ పథకాన్ని సైతం మంత్రి వివరించారు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు గ్రామీణ తాగునీటి రంగంలో ఓక అదర్శంగా నిలలిచిపోతుందన్నారు.
ఈ ప్రజెంటేషన్ అనంతరం మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్ మంత్రిని పోగడ్తల్లో ముంచేత్తారు. సాదారణంగా మంత్రులు ప్రజెంటేషన్లు చేయరని, అది అధికారుల పని అన్నట్లు వ్యవహరిస్తారని, కానీ యువ మంత్రి ఇచ్చిన తీరు చాల భాగుందన్నారు. మంత్రి ప్రజేంటేషణ్ అయనికి ప్రాజెక్టు పైన ఉన్న అవగాణ, చిత్తశుద్దని తెలుపుతుందన్నారు. ఈ ప్రాజెక్టు గురించి హైదరాబాద్కి వచ్చి తాను తెలుసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు అదర్శంగా తీసుకోవాలని ఇతర రాష్ర్టాల మంత్రులకి బీరేంద్ర సింగ్ సూచించారు.

ఈ సమావేంలో పాల్గోన్న ఇతర మంత్రులు, అధికారులు మంత్రి దగ్గరకి వచ్చిన వ్యక్తిగతంగా అభినందించారు. మంత్రి కెటియార్ తోపాటు పంచాయితీరాజ్ శాఖ స్పేషల్ సియస్ యస్ పి సింగ్, అర్ డబ్యూయస్ ఈయన్ సి సురేందర్ రెడ్డిలు ఉన్నారు.