వెంకీ సరసన లెజెండ్ హీరోయిన్ రాధికా ఆప్టే

వెంకటేష్ ప్రస్తుతం హీరోయిన్ వేటలో పడ్డాడు. నయనతార హ్యిండివ్వడంతో ఓ మై గాడ్ రీమేక్ కోసం హీరోయిన్ ని వెతుకుతున్నాడు. వెంకీ బ్రదర్ సురేష్ బాబు కన్ను మాత్రం రాధికా ఆప్టే మీద పడిందట. అవును ఇటీవలే లెంజెండ్ సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మను వెంకీ కోసం మాట్లాడుతున్నాడట. 

వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించే మల్టీస్టారర్ చిత్రం ఓ మై గాడ్. హిందీలో సూపర్ హిట్టయిన ఈచిత్రంలో వెంకీ సరసన నటించే హీరోయిన్ ఇంకా దొరకలేదు. అయితే నయనతారను ఆల్రెడీ సంప్రదించారట. కానీ ఆమె చెప్పిన రెమ్యూనరేషన చూసి ఖంగుతిన్నారట. వెంటనే మరో హీరోయిన్ కోసం వెతకడం ప్రారంభించారు. చివరికి రాధికా ఆప్టే అయతే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఈ చిత్రాన్ని సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డాలీ దర్శకుడు.