లింగాను చేజిక్కించుకున్న సాయి కొర్రపాటి

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లింగ సినిమా తెలుగు హక్కులను ఈగ, లెజెండ్ వంటి హిట్ చిత్రాల నిర్మాత సాయి కొర్రపాటి లింగ తెలుగు వెర్షన్ హక్కులు భారీ రేటు చెల్లించి దక్కించుకున్నారని వినికిడి. ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకునేందుకు పలువురు నిర్మాతలు ముందుకు వచ్చిన చివరకు సాయికి హక్కులు దక్కించుకున్నారని సమాచారం. రోబో తర్వాత కొచ్చాడయాన్ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో రజనీ కాస్త నిరాశ చెందాడు.

గతంలో రజనీ-కేఎస్.రవికుమార్ కాంబినేషన్లో ముత్తు, నరసింహ సూపర్‌హిట్ అయ్యాయి. ఇప్పుడు లింగాతో వీరు హ్యాట్రిక్ కొడతారన్న వార్తలు ఉన్నాయి. తెలుగు నటుడు జగపతిబాబు ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నారు. ఏఆర్.రెహ్మన్ సంగీతం అందించిన ఈ సినిమాలో రజనీ సరసన అనుష్క, సోనాక్షిసిన్హా జంటగా నటించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న ఏరోస్ ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్నారు.