ఎన్‌బీకే లయన్ ఫస్ట్ డే కలెక్షన్స్…ఏరియా వైజ్ డీటైల్స్

యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్‌బీకే లయన్ సినిమా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 5.5 కోట్లు సాధించింది. ఎస్ఎల్‌వీ సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మించిన ఈ సినిమాకు నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వం వహించారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నా అవి రీచ్ కాకపోవడంతో అనుకున్న దానికంటే కలెక్షన్లు తక్కువగా వచ్చాయి.

దీనికి తోడు గుంటూరు, సీడెడ్ ఏరియాల్లో లేటుగా రిలీజ్ అవ్వడం కూడా కలెక్షన్లపై ప్రభావం చూపింది. బాలయ్య గత చిత్రం లెజెండ్ తొలి రోజు రూ 6.9 కోట్ల వసూళ్లు సాధించింది. లయన్ తొలి రోజు అనుకున్న దానికంటే తక్కువగా రూ 5.5 కోట్లు సాధించింది. లయన్ తొలి రోజు ప్రాంతాల వారీగా ఇలా ఉన్నాయి. 

వెస్ట్- 45 లక్షలు
ఈస్ట్- 44 లక్షలు
ఉత్తరాంధ్ర- 49.12 లక్షలు
నైజాం- 1.49 కోట్లు
నెల్లూరు- 33.19 లక్షలు
కృష్ణా- 44.76 లక్షలు
సీడెడ్- 1.22 కోట్లు
గుంటూరు- 72 లక్షలు
=======================
ఏపీ, తెలంగాణలో తొలి రోజు మొత్తం రూ 5.55 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్లకు తోడు కర్ణాటక, తమిళనాడు, ఓవర్సీస్ కలెక్షన్లు అదనం కానున్నాయి.