లీసా 3డీ మూవీ రివ్యూ….

అంజలికి తెలుగులో మాత్రమే కాదు… తమిళంలోనూ మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. అంజలి ఎంచుకునే కథలే విభిన్నంగా ఉంటాయి. కథ, కథనం బలంగా ఉండే చిత్రాలే చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. అయితే కాస్త గ్యాప్ తర్వాత అంజలి మరోసారి అలరించేందుకు వచ్చేసింది. లిసా అనే చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసింది. ఈ చిత్రాన్ని రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో వీరేష్ కాసాని సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్ సంస్థ అధినేత సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకుల కోసం భారీగా రిలీజ్ చేశారు. అయితే ఈ హార్రర్ చిత్రాన్ని 3డీలో తెరకెక్కించడంతో భారీ క్రేజ్ నెలకొంది. అంజలికున్న క్రేజ్, 3డీ ఫార్మాట్ లో రూపొందించడం, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా విడుదల కోసం హార్రర్ సినిమాల్ని అమితంగా ఇష్టపడే ప్రేక్షకులు ఎదురుచూశారు. వారి వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పెడుతూ లీసా 3డీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది… ప్రేక్షకుల్ని ఏ విధంగా ఎంటర్ టైన్ చేసింది. ఏ విధంగా భయపెట్టిందో చూద్దాం.

కథేంటంటే….
లీసా (అంజలి) తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. తల్లి పెంపకంలో పెరుగుతుంది. అందుకే తల్లికి మరో పెళ్లి చేసి తాను అమెరికా వెళ్లాలనుకుంటుంది. దీంతో అమ్మమ్మ, తాతయ్యను ఎలాగైనా కన్విన్స్ చేసి అమ్మను వారితో కలపి పెళ్లికి ఒప్పించాలని…. వారి దగ్గరికి బయలుదేరుతుంది. తనతో పాటు తన స్నేహితుడిని కూడా వెంట తీసుకెళ్తుంది. వారిద్దరూ అమ్మమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్లిన తర్వాత వింత అనుభూతులు ఎదురౌతాయి. దెయ్యాలున్నాయనే అనుమానం వస్తుంది. వీరిని చంపేందుకు ఎవరో ప్రయత్నిస్తుంటారు. తాతయ్య, అమ్మమ్మ కు మాత్రం ఈ విషయం చెప్పరు. వారిద్దరి మీద వీరికి అనుమానం వస్తుంది.

ఇంతకూ తాతయ్య, అమ్మమ్మ ఇంట్లో ఏం జరుగుతోంది. ఏం చూసి లీసా ఆమె స్నేహితుడు భయపడ్డారు. ఎవరిని వీరిని చంపాలనుకుంటారు. ఎలా చంపాలనుకుంటారు. తాతయ్య అమ్మమ్మకు దెయ్యాలనున్నాయనే విషయాన్ని ఎందుకు చెప్పలేదు. వారిని లీసా ఎందుకు అనుమానించింది. దెయ్యాలున్నాయని భయపడ్డ ఇంటినుంచి లీసా అతని స్నేహితుడు బయటపడ్డారా. తాతయ్య, అమ్మమ్మ ఏమయ్యారు. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష

ముందుగా దర్శకుడు రాజు విశ్వనాథ్ ని అభినందించాలి. చిన్న బడ్జెట్ లో టెక్నికాలిటీస్ ని అందిపుచ్చుకొని 3డీ లోతెరకెక్కించాలనే ఆలోచన రావడం అభినందనీయం. వందల కోట్లు వెచ్చించకుండానే 3డీలో హార్రర్ సినిమా తీయడం గ్రేటే. ఇది అన్ని దెయ్యాల సినిమాల్లాగా రొటీన్ గా ఉండదు. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా 3డిలో డిఫరెంట్ గా ప్రయత్నించిన చిత్రమిది. నాణ్యమైన విజువల్స్ కోసం 8కె ఫార్మాట్ లో తెరకెక్కించి 2కె ఫార్మాట్ కి మార్చిన విధానం అద్భుతంగా ఉంది. ఛాయాగ్రాహకుడు పీజీ ముత్తయ్య ఈ సినిమా విజువల్స్ ని మరో లెవల్లో చూపించారు. అంజలి తనదైన పెర్ ఫార్మెన్స్ తో ఆద్యంతం రక్తి కట్టించే నటనతో మెప్పించింది. అంజలి కథను తన భుజాల మీదేసుకొని నడిపించింది. ముఖ్యంగా తాత, అమ్మమ్మతో వచ్చే సీన్స్ లో హైలైట్ గా నటించింది. ఈ సినిమా అంజలికి ప్రత్యేకంగా నిలుస్తుంది.
అలాగే ఈ సినిమాకి మరో ప్రధానాకర్షణ బ్రహ్మానందం. ఆయన తన కామెడీ టైమింగ్ తో కొన్ని సన్నివేశాల్లో తన ముద్ర కనబరుస్తూ కొన్నిచోట్ల నవ్వులు పూయించాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేస్తూ నవ్వించే ప్రయత్నం చేసారు.

దర్శకుడు లిసా చిత్రాన్ని ప్రత్యేకంగా తెరెకెక్కించండ కిక్ ఇచ్చే అంశం. దెయ్యాన్ని 3డీలో చూడటం భయపడడం గతంలో జరగలేదు. కానీ లీసా ఇందుకు ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా అమ్మమ్మ క్యారెక్టర్ తో బాగా భయపెట్టాడు. చైర్ ఊగే సన్నివేశాలు… హీరోయిన్ స్నేహితుడు భయపడే సన్నివేశాల్లో ఒళ్లు జలదరించడం ఖాయం. హార్రర్ ఎఫెక్ట్స్ ని బాగా డిజైన్ చేశారు. హై క్వాలిటీలో ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ లో సెంటిమెంట్ హైలైట్‌ అవ్వడం వంటి అంశాలు లిసాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఇక ఫస్ట్ హాఫ్ సరదాగా గడిచిపోతుందనుకుంటుండగా దర్శకుడు ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాలలతో కాసేపు హారర్ జోనర్ టచ్ చేసి సినిమాని నిలబట్టే ప్రయత్నం చేసాడు. ఇంటర్వెల్ మరియు ముందు సీన్లు బాగున్నాయి.

రెండు గంటలు పాటు లిసా ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. హార్రర్ తో పాటు కామెడీ కూడా జనరేట్ కావడంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడా బోర్ కొట్టకుండా కథ వెళ్తుంది. డైరెక్టర్ టెంపో ఎక్కడా తగ్గకుండా బాగా మేనేజ్ చేయగలిగాడు. కామెడీ అండ్ హార్రర్ సీన్స్ తో కథను తీసుకెళ్లిని విధానం బాగుంది. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాల్ని పండించాడు. సంతోష్ దయానిధి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా సన్నివేశాల స్థాయిని పెంచాడు. గ్రాఫిక్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. కథకు తగ్గట్టుగా నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి.

ఓవరాల్ గా…
3డీ దెయ్యాన్ని గతంలో ఎప్పుడూ చూసి ఉండం. లీసా చిత్రంతో ఆ కోరిక నెరవేరుతుంది. గతంలో ఎప్పుడూ పొందని అనుభూతి ఈ సినిమాతో దక్కుతుంది. హార్రర్ జోనర్ లో ఇదో కొత్త ప్రయోగం. హార్రర్ ఎఫెక్ట్స్ తో బాగా ఎంజాయ్ చేయ్యెచ్చు. అంజలి పెర్ ఫార్మెన్స్, హార్రర్ సీక్వెన్సులు, క్లైమాక్స్ సెంటిమెంట్ అండ్ మంచి మెసేజ్ సినిమాను నిలబెట్టాయి. కొత్త హార్రర్ అనుభూతి పొందాలనుకునే వారు తప్పకుండా చూడాల్సిన చిత్రం.

PB Rating : 3.5/5