పెర్ఫార్మెన్స్ ఉండే రోల్స్ కోసం వెయిటింగ్ – హెజా హీరోయిన్ లిజీ గోపాల్

పెర్ఫార్మెన్స్ ఉండే రోల్స్ కోసం వెయిటింగ్ – హెజా హీరోయిన్ లిజీ గోపాల్

ఒరిస్సాలో పుట్టి పెరిగినప్పటికీ తెలుగుపై మమకారంతో తెలుగు నేర్చుకొని తెలుగులో సినిమాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది లిజీ గోపాల్. ఇటీవలే తెలుగులో వచ్చిన హెజా సినిమా లిజీకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో ఆమె పెర్ ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ సినిమా తర్వాత తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని… కానీ మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్రల్లో నటించాలనుకుంటున్నానని అన్నారు. తాను అన్ని రకాల పాత్రలకు సెట్ అవుతానని… హెజా సినిమా నాలో కాన్ఫిడెన్స్ ను పెంచిందని అంటోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీల నుంచి కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయని…. త్వరలోనే ఓ మంచి సినిమాతో రాబోతున్నానని అంటోంది. హెజా సినిమాను ఘనవిజయం చేసిన ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా థాంక్స్ చెప్పింది.